వందేళ్లు దాటిన యోగా టీచర్‌కు పద్మశ్రీ (వీడియో వైరల్)

100 year-old French Yoga teacher Charlotte Chopin conferred with Padma Shri
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన పద్మ అవార్డుల వేడుకలో వందేళ్లు దాటిన విదేశీయురాలు భారత సంప్రదాయంలో చీరలో వచ్చి అందిరి దృష్టినీ ఆకర్షించింది. ఫ్రాన్స్ కు చెందిన 101 ఏళ్ల యోగా టీచర్ చార్లెట్ చోపిన్ ఈ వయసులోనూ స్వయంగా నడుచుకుంటూ వచ్చి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ శ్రీ అవార్డును అందుకున్నారు. వందేళ్లు దాటినప్పటికీ యోగా చేయడం వల్ల ఆమె ఇప్పటికీ పిట్ గా ఉన్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె అవార్డు అందుకున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి కూడా భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు. గురువారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సంవత్సరం జనవరి 25న 132 మందికి అవార్డులు ప్రకటించారు. సినీ రంగంలో కొణిదెల శివశంకర వరప్రసాద్(చిరంజీవి) చేసిన సేవలకుగాను ఈ అవార్డు వరించింది. ఇక ఈ వేడుకలో చిరంజీవి భార్య సురేఖ, కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసన పాల్గొన్నారు.
Tags
-
Home
-
Menu