హీరో జయం రవికి షాక్.. అతడి ఇల్లు వేలం

Jayam Ravi
X

Jayam Ravi

చెన్నై: హీరో జయం రవి (Jayam Ravi) చిక్కుల్లో పడ్డారు. చెన్నైలోని ఆయన ఇంటిని బ్యాంకు అధికారులు వేలం వేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఇంటికి సంబంధించిన రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ఇంటికి నోటీసులు అంటించారు. ఈ ఇంటికోసం ఓ ప్రైవేటు బ్యాంకు నుంచి రవి పెద్ద ఎత్తున అప్పు చేశారు. అయితే నెలవారీ వాయిదాలు చెల్లించపోవడంతో సుమారు రూ.7.60 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. హీరో రవికి ఇప్పటికే బ్యాంకు అధికారులు నోటీసులు […]

చెన్నై: హీరో జయం రవి (Jayam Ravi) చిక్కుల్లో పడ్డారు. చెన్నైలోని ఆయన ఇంటిని బ్యాంకు అధికారులు వేలం వేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఇంటికి సంబంధించిన రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ఇంటికి నోటీసులు అంటించారు. ఈ ఇంటికోసం ఓ ప్రైవేటు బ్యాంకు నుంచి రవి పెద్ద ఎత్తున అప్పు చేశారు. అయితే నెలవారీ వాయిదాలు చెల్లించపోవడంతో సుమారు రూ.7.60 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. హీరో రవికి ఇప్పటికే బ్యాంకు అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నో రిమైండర్ లేఖలు పంపినట్లు సమాచారం. అయినా, ఆయన స్పందించకపోవడంతో ఇంటికి నోటిసులు అందించినట్లు కోలీవుడ్ మీడియా వెల్లడించింది.

Also Read : ఆ సినిమాపైనే రామ్ చరణ్ హీరోయిన్ ఆశలు..

Tags

Next Story