వనపర్తిలో ట్రాక్టర్ కిందపడి బాలుడు మృతి

Amarachinta Mandal Wanaparthy
X

Amarachinta Mandal Wanaparthy

అమరచింత: వనపర్తి జిల్లా అమరచింత మండల పరిధిలోని సింగంపేట గ్రామంలో ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... సింగంపేట గ్రామానికి చెందిన వడ్డీ ఆంజనేయులు కుమారుడు వడ్డే వెంకట్ అనే బాలుడు (10) ట్రాక్టర్ మీద వెళ్తుండగా ప్రమాదవశాత్తు టైర్ల కింద పడ్డాడు. వెంటనే బాలుడు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందాడని పేర్కొన్నారు. సింగంపేట గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. పదేళ్ల కుమారుడు కళ్ల ముందట చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీంటపర్యంతమయ్యారు.

Tags

Next Story