తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

Today Tirumala Temple Information
X

Today Tirumala Temple Information

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. మంగళవారం స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల నుంచి 8 గంటల సమయం పడుతోంది.

కాగా, సోమవారం తిరుమల వెంకన్నను 67,300 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇందులో 22,380 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారికి హుండీ ద్వారా రూ.4.04 కోట్ల ఆదాయం సమకూరినట్లు టిటిడి అధికారులు తెలిపారు.


Tags

Next Story