ఆసియాకప్‌ టైటిల్ పోరులో భారత్ vs పాక్..

ఆసియాకప్‌ టైటిల్ పోరులో భారత్ vs పాక్..
X

దుబాయి: ఆసియాకప్‌లో పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్4 కీలక మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. 136 పరుగుల లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఆదివారం జరిగే ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో పాకిస్థాన్ తలపడుతుంది. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది మూడు, రవూఫ్ మూడేసి వికెట్లను పడగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 […]

దుబాయి: ఆసియాకప్‌లో పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్4 కీలక మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. 136 పరుగుల లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఆదివారం జరిగే ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో పాకిస్థాన్ తలపడుతుంది. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది మూడు, రవూఫ్ మూడేసి వికెట్లను పడగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన పాక్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ సాహిబ్‌జాద (4) మరోసారి నిరాశ పరిచాడు. ఇక సైమ్ అయుబ్ తన పేలవమైన ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తూ సున్నాకే ఔటయ్యాడు. మరో ఓపెనర్ ఫకర్ జమాన్ (13), కెప్టెన్ సల్మాన్ ఆఘా (13), హుస్సేన్ తలత్ (3) మళ్లీ విఫలమయ్యారు. అయితే వికెట్ కీపర్ మహ్మద్ హారిస్ (31), షహీన్ అఫ్రిది (19), మహ్మద్ నవాజ్ (25), ఫహీమ్ అశ్రఫ్ 14 (నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌తో పాక్‌ను ఆదుకున్నారు.

Tags

Next Story