ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఇంత అహంభావమా?

Australia rude with World cup
X

Australia rude with World cup

వరల్డ్ కప్ గెలుచుకోవడంతోనే ఆస్ట్రేలియా ఆటగాళ్ళకు కళ్లు నెత్తికెక్కాయని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిన్స్ టీమ్ కప్పు గెలుచుకుని సంబరాలు చేసుకుంది. గ్రౌండంతా కలియదిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేస్తూ కోలాహలంగా గడిపారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ హోటల్ రూమ్ కు వెళ్లాక బీర్లు తాగుతూ కప్పును కింద పెట్టి దానిపై కాళ్లు పెట్టుకుని కూర్చోవడమే ఇప్పుడు క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.

ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ కప్పుపై కాలు పెట్టుకుని ఫోటోకి ఫోజులు ఇచ్చాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మార్ష్ అహంభావానికి ఇది నిదర్శనమని, కప్పును గౌరవించడం చేతకాని ఆటగాళ్లని నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Tags

Next Story