భద్రాచలం లాడ్జిలో దారుణం.. గిరిజన యువకుడి హత్య!

భద్రాచలం లాడ్జిలో దారుణం.. గిరిజన యువకుడి హత్య!
X

మన తెలంగాణ - క్రైమ్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భద్రాచలంలోని ఓ లాడ్జిలో అర్ధరాత్రి గిరిజన యువకుడు హత్యకు గురయ్యాడు. లాడ్జి సిబ్బంది దాడిలో శరత్ (24) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. భద్రాచలంలోని ఓ లాడ్జిలో ముగ్గురు గిరిజన యువకులకు, లాడ్జి సిబ్బందికి మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో లాడ్జికి సంబంధించిన వ్యక్తి శరత్‌పై దాడి చేసినట్లు సమాచారం.

సిబ్బంది కొట్టడంతో శరత్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో వెంటనే అతడిని భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే శరత్ మృతి చెందాడు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు గల కారణాలు, వివాదం వెనుక ఉన్న పరిస్థితులపై దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story