యాదాద్రి భువనగిరి జిల్లాలో రాకపోకలకు అంతరాయం

Bhuvanagiri-Chityala road closed
మన తెలంగాణ / మోటకొండూరు: యాదాద్రి భువనగిరి జిల్లా పలు ప్రాంతాలలో రాకపోకలకు అంతరాయం కలిగింది. భువనగిరి - చిట్యాల రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. నాగిరెడ్డిపల్లి వద్ద లోలెవల్ బ్రిడ్జిపై వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతికి వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా ఆలేరు మోటకొండూర్ మధ్య రాకపోకలు బంద్ చేస్తూ బారి కేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. బహుదూర్ పేట వాగు, మంతపురి వద్ద ఉన్న ఈదుల వాగు ఉదృతంగా […]
మన తెలంగాణ / మోటకొండూరు: యాదాద్రి భువనగిరి జిల్లా పలు ప్రాంతాలలో రాకపోకలకు అంతరాయం కలిగింది. భువనగిరి - చిట్యాల రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. నాగిరెడ్డిపల్లి వద్ద లోలెవల్ బ్రిడ్జిపై వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతికి వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా ఆలేరు మోటకొండూర్ మధ్య రాకపోకలు బంద్ చేస్తూ బారి కేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. బహుదూర్ పేట వాగు, మంతపురి వద్ద ఉన్న ఈదుల వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నందున ఆలేరు, మోటకొండూర్, ఇతర గ్రామాలకు వెళ్లే ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు ద్వారా వెళ్లాలని ఆలేరు పురపాలక సంఘ కమిషనర్, పోలీసులు సూచించారు.
Also Read: దేశానికి సీడ్‌హబ్
-
Home
-
Menu