రీల్స్ మోజులో తల్లి పిచ్చి పని.. సజ్జనార్ సీరియస్

సోషల్‌మీడియా వాడకం పెరిగిపోయాక.. చాలా మంది దానికి అడిక్ట్ అవుతున్నారు. తమకు ఫాలోవర్లు, రీచ్ పెరగడం కోసం పిచ్చి పనులు చేసేవారు చాలా మందే ఉన్నారు. ఇందుకోసం తమ ప్రాణాలనే రిస్క్‌లో పెట్టేవాళ్లు లేకపోలేదు. అయితే రీల్స్ మోజులో పడి ఓ తల్లి చేసిన పనికి హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఓ తల్లి బావి అంచుపై నిలుచొని ఇద్దరు పిల్లల్ని చేతులతో పట్టుకొని.. చాలా ప్రమాదకరంగా రీల్ చేసింది. ఇది సజ్జనార్ కంట పడింది. దీంతో ఆయన ఆ వీడియోని షేర్ చేస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు.
సదరు వీడియోని ఎక్స్‌లో పోస్ట్ చేసిన సజ్జనార్ ‘‘ఇది సోషల్ మీడియా ఉన్మాదానికి పరాకాష్ట! కన్నబిడ్డలను బావి అంచున నిలబెట్టి రీల్స్ చేయడం సాహసం కాదు.. అది మూర్ఖత్వం. ఆత్మహత్యాసదృశ్యం. పిల్లలకు రక్షణగా ఉండాల్సిన పెద్దలే వారిని మృత్యువు అంచున నిలబెట్టడం చూస్తుంటే, సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. సోషల్ మీడియా పిచ్చిని ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఇలాంటి ఉన్మాద చర్యలను ప్రోత్సహించకండి’’ అని పేర్కొన్నారు.
-
Home
-
Menu
