వినియోగదారులకు షాక్.. ఆ ఫీజు పెంచేసిన జొమాటో..

X
పశ్చిమాసియాలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ప్లాట్‌ఫామ్ ఫీజును జొమాటో పెంచేసింది. కంపెనీ యాప్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వినియోగదారులు ఒక్కో ఆర్డర్‌కు ఇక నుంచి రూ.2.40 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటికే వసూలు చేస్తున్న ఫీజు రూ.12.50 నుంచి 14.90కి పెరిగింది. జొమాటో, దాని పోటీ సంస్థ స్విగ్గీ ఒకే తరహాలో ధరల ట్రెండ్‌ను అనుసరిస్తుంటాయి. అన్ని పన్నులు కలుపుకొని ప్రస్తుతం స్విగ్గీ వసూలు చేస్తున్న ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.14.99గా ఉంది. యుద్ధం కారణంగా పెరుగుతున్న ఇంధన ధరలు డెలివరీ కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ ఫీజు పెంపునకు అది ఓ కారణంగా చెప్పుకోవచ్చు.
Next Story
-
Home
-
Menu
