విద్యార్థుల ఫుడ్ పాయిజన్... బిఆర్ఎస్ కార్యకర్తల అరెస్టు

BRS activists arrested
X

BRS activists arrested

మహబూబ్ నగర్: నారాయణ పేట జిల్లా మాగనూరు జెడ్పి హై స్కూల్ విద్యార్థుల ఫుడ్ పాయిజన్ వరుస సంఘటనలతో ప్రభుత్వానికి భయం పట్టుకుంది. మక్తల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మద్దతుగా బిఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహిస్తారన్న అనుమానంతో బుధవారం తెల్లవారుజాము నుంచే మాజీ ఎమ్మెల్యే తో పాటు అన్ని మండలాలకు సంబంధించిన బిఆర్ఎస్ ముఖ్య నాయకులను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. అరెస్టు చేసిన నాయకులను జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇదే క్రమంలో మాగనూరులో సైతం ఎలాంటి ఆందోళనలకు పాల్పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా డిఎస్పి లింగయ్య నేతృత్వంలో భారీగా పోలీసులను మొహరింపజేశారు.

నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మండల పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు విరేచనాలు చేసుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. దాదాపుగా 100 మంది విద్యార్థులు స్పృహ లేకుండా పడిపోవడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags

Next Story