బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించిన కవిత.. నేడు విచారణ

brs leader k kavitha approaches delhi high court
X

brs leader k kavitha approaches delhi high court

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పటిషన్ పై శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ మద్యం కేసులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ కేసులో బెయిల్ కోరుతూ నిన్న కవిత పిటిషన్ వేశారు. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం కవిత బెయిల్ పై విచారణ చపట్టనుంది. ఈనెల 6న కవిత బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ఈడీ, సిబిఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు డిస్మిస్ చేసింది. సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

Tags

Next Story