బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా ఆందోళన... రాజయ్యపేటలో ఉద్రిక్తత

Bulk Drug Park
X

Bulk Drug Park

అమరావతి: ఆంధప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఉద్రిక్తత కొనసాగుతుంది. బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా మత్స్యకారులు ఉద్యమం చేస్తున్నారు. రాజయ్యపేట, బోయపాడు మత్స్యకారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనితకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. పిఠాపురంలో ఒక విధంగా పాయకరావుపేటలో మరో విధంగా పవన్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ కంటే […]

అమరావతి: ఆంధప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఉద్రిక్తత కొనసాగుతుంది. బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా మత్స్యకారులు ఉద్యమం చేస్తున్నారు. రాజయ్యపేట, బోయపాడు మత్స్యకారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనితకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. పిఠాపురంలో ఒక విధంగా పాయకరావుపేటలో మరో విధంగా పవన్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ కంటే ఉరే సరి మత్యకారులు మెడలో ఉరితాళ్లు వేసుకొని నిరసన తెలిపారు. ఈ పార్క్‌తో తమ ప్రాణాలకు ముప్పు వాటిళ్లే అవకాశం ఉందన్నారు. గత పది రోజుల నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు.

Tags

Next Story