జీవితం

burden can carried
X

burden can carried

అక్కడ రాలిపడి నిక్షిప్తమైన మౌనాల్ని ఏరుకుంటున్నాను మోయలేని బరువేం కాదు మోయడానికి చేతికందడం లేదు చెవులు రిక్కించి విన్నా శబ్దాల జాడ తెలియడం లేదు శబ్దాల మోత జరగక కాదు ఆ హోరుకు చెవులు గడియలు పడ్డాయేమో కాలాన్ని చాపలా సాగదీసి నిన్నలో కాచుక్కూచున్నాను వెనక నుండి ఒక్కసారిగా చుట్టుకుని ఏ దిక్కుకో విసిరేసినట్టుంది శ్వాసకోశాలను గొట్టాలుగా చేసి ఎంత ఊదినా నివురు చెదరటం లేదు నిప్పును ఇక చూడలేనేమో ఈ కళ్ళతో అర్ధాకలితో ఆవిరై పోవాల్సినట్టుంది […]

అక్కడ రాలిపడి నిక్షిప్తమైన
మౌనాల్ని ఏరుకుంటున్నాను
మోయలేని బరువేం కాదు
మోయడానికి చేతికందడం లేదు

చెవులు రిక్కించి విన్నా
శబ్దాల జాడ తెలియడం లేదు
శబ్దాల మోత జరగక కాదు
ఆ హోరుకు చెవులు గడియలు
పడ్డాయేమో
కాలాన్ని చాపలా సాగదీసి
నిన్నలో కాచుక్కూచున్నాను
వెనక నుండి ఒక్కసారిగా చుట్టుకుని
ఏ దిక్కుకో విసిరేసినట్టుంది

శ్వాసకోశాలను గొట్టాలుగా చేసి
ఎంత ఊదినా నివురు చెదరటం లేదు
నిప్పును ఇక చూడలేనేమో ఈ కళ్ళతో
అర్ధాకలితో ఆవిరై పోవాల్సినట్టుంది

రెక్కలు కట్టుకుని చుక్కల చూడాలన్నా
ఆకాశం చుక్కల్ని ఎటో విసిరేసింది
ఇప్పుడైతే ఆకాశమూ కనబటం లేదు
అంతే.. నాలుగు గోడల మధ్య
గువ్వలా ముడుచుకున్నాను

Also Read : ప్లాన్ బీ అవసరమే!

  • గుడ్లదొన సాయి చంద్రశేఖర్

Tags

Next Story