చంద్రబాబుకు సిఐ శంకరయ్య లీగల్ నోటీసులు

CI Shankaraiah sends legal notices to Chandrababu
X

CI Shankaraiah sends legal notices to Chandrababu

అమరావతి: ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిఐ శంక‌ర‌య్య లీగ‌ల్ నోటీసులు పంపించారు. రూ. 1.45 కోట్లు చెల్లించాల‌ని నోటీసుల్లో పేర్కొన్నారు. వివేకా హ‌త్య కేసులో త‌న ప్రతిష్టకు బాబు భంగం క‌లిగించార‌ని ఆరోప‌ణ‌లు చేశారు. అసెంబ్లీలో సిఎం చంద్ర‌బాబు బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని నోటీసులో వివరించారు. త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట దెబ్బ‌తినేలా చంద్రబాబు వ్యాఖ్య‌లు చేశార‌ని శంకరయ్య ఆరోపణలు చేశారు. వివేకా హ‌త్య జ‌రిగిన‌ప్పుడు 2019లో పులివెందుల సిఐగా శంక‌ర‌య్య ఉన్నారు. ప్ర‌స్తుతం క‌ర్నూలు రేంజ్‌లో […]

అమరావతి: ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిఐ శంక‌ర‌య్య లీగ‌ల్ నోటీసులు పంపించారు. రూ. 1.45 కోట్లు చెల్లించాల‌ని నోటీసుల్లో పేర్కొన్నారు. వివేకా హ‌త్య కేసులో త‌న ప్రతిష్టకు బాబు భంగం క‌లిగించార‌ని ఆరోప‌ణ‌లు చేశారు. అసెంబ్లీలో సిఎం చంద్ర‌బాబు బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని నోటీసులో వివరించారు. త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట దెబ్బ‌తినేలా చంద్రబాబు వ్యాఖ్య‌లు చేశార‌ని శంకరయ్య ఆరోపణలు చేశారు. వివేకా హ‌త్య జ‌రిగిన‌ప్పుడు 2019లో పులివెందుల సిఐగా శంక‌ర‌య్య ఉన్నారు. ప్ర‌స్తుతం క‌ర్నూలు రేంజ్‌లో శంక‌ర‌య్య వీఆర్‌లో ఉన్నారు. సిఐ శంకరయ్య సమక్షంలోనే నిందితులు హత్యకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేశారని గతంలో చంద్రబాబు దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Tags

Next Story