ఆ స్టార్ కారణంగానే డ్యాన్స్‌లో నైపుణ్యం: తమన్నా

ఆ స్టార్ కారణంగానే డ్యాన్స్‌లో నైపుణ్యం: తమన్నా
X

మిల్కీ బ్యూటీ తమన్నా పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే తనకి డ్యాన్స్ ఇంత పర్ఫెక్ట్‌గా రావడానికి కారణం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. తమన్నా మాట్లాడుతూ.. “నేను అల్లు అర్జున్ కారణంగానే డ్యాన్స్‌లో ఉండే నైపుణ్యాలను నేర్చుకున్నాను. నేను బద్రీనాథ్ సినిమా చేసే సమయంలో అల్లు అర్జున్ నన్ను చాలా ప్రోత్సహించాడు. ఆయన నుండే నేను డ్యాన్స్ పర్ఫెక్షన్ నేర్చుకున్నాను. అల్లు అర్జున్ ఇచ్చిన సలహా డ్యాన్స్ ను మెరుగుపరచడంలో సహాయపడింది. అందుకే సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా ఒప్పుకుంటున్నాను” అని పేర్కొంది.

Tags

Next Story