సాయంత్రం గోషామహల్‌కు సిఎం రేవంత్ రెడ్డి

X
CM Revanth Reddy visit to Goshamahal
హైదరాబాద్: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. శుక్రవారం సాయంత్రం 6.45 గంటలకు గోషామహల్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో సిఎం పాల్గొంటున్నారు. గోషామహల్ శాసనసభ నియోజకవర్గంలో బిజెపి నేత రాజాసింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజాసింగ్ ఇలాకాలో సిఎం రేవంత్ రెడ్డి రోడ్ షో, మీటింగ్ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. నేడు మక్తల్, షాద్ నగర్ లో కూడా సిఎం రేవంత్ పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు మక్తల్ జనజాతర సభకు సిఎం హాజరుకానున్నారు. సాయంత్రం 5.30 గంటలకు షాద్ నగర్ రోడ్ షో, కార్నర్ మీటింల్ లో పాల్గొని ప్రసంగించనున్నారు. రాత్రి 8.30 గంటలకు తాజ్ కృష్ణలో మీట్ ది ప్రెస్ లో సిఎం పాల్గొనునున్నారు. గోషామహల్ శాసనసభ నియోజకవర్గంలో బిజెపి నేత రాజాసింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
Tags
Next Story
-
Home
-
Menu