భార్యను కత్తితో పొడిచి చంపి... వాట్సప్ స్టేటస్ పెట్టుకున్న భర్త

భార్యను కత్తితో పొడిచి చంపి... వాట్సప్ స్టేటస్ పెట్టుకున్న భర్త
X

చెన్నై: భార్యతో బంధువు వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నాడని ఆమెను భర్త చంపాడు. భార్య మృతదేహంతో భర్త వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తిరునెల్వెలి నగరంలోని దరువై ప్రాంతంలో బాలమురుగన్, శ్రీప్రియ అనే దంపతులు నివసిస్తున్నారు. దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గత కొన్ని రోజులుగా దంపతులు మధ్య గొడవలు జరగడంతో ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. బాలమురుగన్ బంధువు ఇసక్కిరాజాతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఇసక్కిరాజా తన వాట్సప్ స్టేటస్‌లో భార్య ఫొటోను పెట్టుకోవడంతో బాలమురుగన్ ఆగ్రహంతో రగిలిపోయాడు. వెంటనే ఆమె ఉంటున్న ప్రదేశానికి వెళ్లి భార్యను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం భార్య మృతదేహంతో ఫొటో తీసుకొని వాట్సప్ స్టేటస్‌లో పెట్టుకున్నాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. భర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Next Story