‘పూరి’ గీసిన ‘చిరు’ చిత్రం.. ఆయనకెంతో స్పెషల్

Puri Jagannadh
X

Puri Jagannadh

టాలీవుడ్‌లో చాలా మంది దర్శకులకు మెగాస్టార్ చిరంజీవి అభిమాన నటుడు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని చాలా మంది ఇండస్ట్రీకి వస్తుంటారు. అందులో కొంతమందికి ఆయన్న డైరెక్ట్ చేసే అవకాశం దొరుకుతుంది. డైనమిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కూడా చిరంజీవి అభిమానే. ఒకప్పుడు వరుస హిట్లతో ఇండస్ట్రీని షేక్ చేసిన పూరి ప్రస్తుతం స్పీడ్ తగ్గించారు. అయితే సోషల్‌మీడియాలో మాత్రం ఆయన చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజా చిరంజీవి ‘ఖైదీ’ సినిమా విడుదల సందర్భంగా తాను […]

టాలీవుడ్‌లో చాలా మంది దర్శకులకు మెగాస్టార్ చిరంజీవి అభిమాన నటుడు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని చాలా మంది ఇండస్ట్రీకి వస్తుంటారు. అందులో కొంతమందికి ఆయన్న డైరెక్ట్ చేసే అవకాశం దొరుకుతుంది. డైనమిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కూడా చిరంజీవి అభిమానే. ఒకప్పుడు వరుస హిట్లతో ఇండస్ట్రీని షేక్ చేసిన పూరి ప్రస్తుతం స్పీడ్ తగ్గించారు. అయితే సోషల్‌మీడియాలో మాత్రం ఆయన చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజా చిరంజీవి ‘ఖైదీ’ సినిమా విడుదల సందర్భంగా తాను చేసిన ఓ పని గురించి అభిమానలతో పంచుకున్నారు.

తాజాగా తన పాత డైరీ దొరికిందని ఆయన సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘‘పాత డైరీ దొరికింది. ‘ఖైదీ’ సినిమా రిలీజ్ రోజున.. ఓ అభిమాని స్వయంగా చిరంజీవి గారి చిత్రం గీసి థియేటర్ దగ్గర ఉన్న ఫొటో కార్డ్ డిస్‌‌ప్లేలో పెట్టి 60/40 ఫొటో దొరికింది. ఆ అభిమాని పేరు.. పూరి జగన్నాథ్’’ అంటూ అభిమాని పేరు పూరి జగన్నాథ్’’ అంటూ అప్పట్లో ఆయన గీసిన చిత్రాన్ని పూరి షేర్ చేశారు. దీన్ని బట్టి చూస్తే.. పూరి.. చిరుకి ఏ రేంజ్ ఫ్యానో తెలిసిపోతుంది. రాజకీయాల తర్వాత చిరంజీవి మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చినప్పుడు.. పూరి కూడా చిరంజీవికి ఓ కథ చెప్పారు. ‘ఆటో జానీ’ అనే టైటిల్‌తో మంచి మాస్ చిత్రం ఇది అని అప్పట్లో టాక్ వచ్చింది. కానీ, సినిమా ఎందుకో కార్యరూపం దాల్చలేదు.

Also Read ; ఇడి విచారణకు సోనూసూద్..

Tags

Next Story