బిల్కిస్ బానోకు ‘న్యాయం’ చేసిన అన్యాయం

బిల్కిస్ బానోకు ‘న్యాయం’ చేసిన అన్యాయం
X

2024, జనవరి 8వ తేదీ బిల్కిస్ బానో కేసులో అపెక్స్ కోర్టు రెమిషన్‌ను రద్దు (క్వాష్) చేసింది. ఈ కేసు విచారణ మహారాష్ట్ర లో జరిగిందని, శిక్ష కాలాన్ని తగ్గించవచ్చా, లేదా అనే నిర్ణయం తీసుకునే అధికారం వారికి మాత్రమే ఉంటుంది తప్ప, ఈ విచారణతో ఏ సంబంధం లేని గుజరాత్ ప్రభుత్వానికి ఉండదని తేల్చి చెప్పింది. జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ శిక్ష కాలాన్ని గుజ రాత్ ప్రభుత్వం శిక్ష తగ్గించి వీరిని విడుదల చేయడాన్ని తీవ్ర పదజాలంతో విమర్శించింది. జనవరి 8, 2024న అపెక్స్ కోర్టు గుజరాత్ ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దోషులు రెండు వారాల్లో తిరిగి జైలుకు రావాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కోర్టుల్లో ఇంకా కొంచెం న్యాయబద్ధంగా వ్యవహ రించే వాళ్ళు వున్నారని అనిపించింది. కానీ ఇది అతి కొద్ది సమయమే. ఇప్పుడు మళ్లీ సుప్రీం కోర్టులో ఇద్దరు జడ్జిలు జీవిత ఖైదు శిక్షపడిన ఇద్దరినీ 17 సంవత్సరాల శిక్ష అనుభవించారని వారిలో ఒకరికి తీవ్రమైన వైకల్యం ఉందని అంటూ బెయిల్ మంజూరు చేసింది.

19, 20 ఏళ్ల వయసున్న బిల్కిస్ బానో అప్పుడు ఐదు నెలల గర్భవతి. ఆమెకి మూడేళ్ల కూతురు కూడా ఉంది. పారిపోతున్న ఆమె కుటుంబ సభ్యులను ఆ మూక పట్టుకుంది. ఆమె తల్లిని, సోదరిని, మూడేళ్ల కూతురుతో సహా పద్నాలుగు మంది కుటుంబ సభ్యుల్ని, ఆమె కళ్ళ ముందే ఆ మూకలు చంపి వేశారు. బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేశారు. అది ఎంత క్రూరమైన అత్యాచారం అంటే ఆమె గర్భస్థ శిశువు గర్భంలోనే చనిపోయింది. ఆ దాడి చేసిన వారిలో కొందరు ఆమె ఇరుగు పొరుగు వాళ్ళే. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె చనిపోయిందని భావించి, ఆ మూక వెళ్ళిపోయింది. అర్ధనగ్నంగా, ఒంటి నిండా గాయాలతోఉన్న బిల్కిస్ బానో చివరికి పారిపోయి ప్రాణాలు దక్కించుకుంది. ఒక శరణార్థ శిబిరంలో ఉన్న ఆమెని ఆ తరువాత ఆమె భర్త యాకూబ్ రసూల్ కనుగొన్నాడు.

అక్టోబర్ 28వ తేదీ సుప్రీంకోర్టు జస్టిస్ ఎంఎం. సుందరేశ, జస్టిస్ ప్రసన్న బి. వరాలేలతో కూడిన ధర్మాసనం బిల్కిస్ బానో కేసులో ఇద్దరు దోషులు బిపిన్‌చంద్ కనయాలాల్ జోషి, ప్రదీప్ రామన్ లాల్ మోధియాలకు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను నిలిపివేస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసు విచారణ సమయంలో బిల్కిస్ బానో, ఆమె న్యాయవాదుల వాదనను కనీస వినకుండా, వారికేమీ చెప్పకుండానే ఏకపక్ష తీర్పును ఇవ్వడం జరిగింది. దాదాపు ఇరవై నాలుగేళ్లుగా సామూహిక అత్యాచార బాధితురాలు, బిల్కిస్ బానో సాగిస్తున్న న్యాయ పోరాటం అసాధారణమైంది. దేశ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిన 2002 గుజరాత్ మతపర అల్లర్లలో మార్చి 3, 2002 నాడు బిల్కిస్ బానో నివసించే దోహాడ్ జిల్లా రంధిక్ పూర్ గ్రామంలోని ముస్లిం సామాజిక వర్గం వారిపై దాడి జరిగింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్న బిల్కిస్ బానో, ఆమె కుటుంబ సభ్యులపైన, మతోన్మాద అల్లరి మూకలు దాడి చేశాయి. 19, 20 ఏళ్ల వయసున్న బిల్కిస్ బానో అప్పుడు ఐదు నెలల గర్భవతి. ఆమెకి మూడేళ్ల కూతురు కూడా ఉంది. పారిపోతున్న ఆమె కుటుంబ సభ్యులను ఆ మూక పట్టుకుంది. ఆమె తల్లిని, సోదరిని, మూడేళ్ల కూతురుతో సహా పద్నాలుగు మంది కుటుంబ సభ్యుల్ని, ఆమె కళ్ళ ముందే ఆ మూకలు చంపి వేశారు. బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేశారు. అది ఎంత క్రూరమైన అత్యాచారం అంటే ఆమె గర్భస్థ శిశువు గర్భంలోనే చనిపోయింది. ఆ దాడి చేసిన వారిలో కొందరు ఆమె ఇరుగు పొరుగు వాళ్ళే. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె చనిపోయిందని భావించి, ఆ మూక వెళ్ళిపోయింది. అర్ధనగ్నంగా, ఒంటి నిండా గాయాలతోఉన్న బిల్కిస్ బానో చివరికి పారిపోయి ప్రాణాలు దక్కించుకుంది.

ఒక శరణార్థ శిబిరంలో ఉన్న ఆమెని ఆ తరువాత ఆమె భర్త యాకూబ్ రసూల్ కనుగొన్నాడు. బిల్కిస్ బానో తనపైన, తన పసిబిడ్డపైన, కుటుంబ సభ్యులపైన ఇంత దుర్మార్గానికి, హత్యలకు పాల్పడ్డ నిందితుల్ని చట్ట ప్రకారం శిక్షించాలనే ఒక న్యాయమైన కోరికను ఆనాడు గట్టిగా వ్యక్తం చేసింది. ఆమె భర్త ఆనాటినుంచి ఈనాటి వరకు, ఈ న్యాయపోరాటంలో బిల్కిస్ బానో వెంట దృఢంగా నిలబడ్డాడు. న్యాయ పోరాటంలో అడుగడుగునా రాజకీయ నాయకులు, నిందితులు, పోలీసులనుండి అనేక బెదిరింపులను ఆమె ఎదుర్కొన్నది. అంతేకాదు ఒక బాధితురాలిగా తీరని మానసిక వేదనను అనుభవించింది. అలాగే అభద్రతకు, ఆర్థిక ఇబ్బందులకు గురైంది. బిల్కిస్ బానో అత్యంత శక్తివంతమైన వ్యక్తులను, వ్యవస్థలను ప్రశ్నించడం, వాటితో తలపడటం అంటే సాధారణమైన విషయం కాదు. ఆనాడు గుజరాత్ అల్లర్ల సందర్భంగా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు దేశ ప్రధాన మంత్రి. మరో కీలక వ్యక్తి దేశ హోం మంత్రి.

కాగా బాధితురాలు బిల్కిస్ బానో మాత్రం, గుజరాత్‌ను వదిలిపెట్టి, భయం భయంగా ఎక్కడెక్కడో ఆశ్రయం పొందుతూ, అనేక ఇళ్ళు మారుతూ 24ఏళ్ల కాలంగా క్షణక్షణం ప్రాణభయంతో బతుకుతూ వుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తరువాత ఇద్దరు నేరస్థులు రెమిషన్‌పై బయటకు రావడంపట్ల బిల్కిస్ బానో ఈ పరిణామాలపట్ల నాకు చాలా ఆందోళన, భయం కలుగుతూ ఉంది అని వ్యాఖ్యానించింది. ఈ ఘటన జరిగి అనంతరం బిల్కిస్ బానో ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్ కి వెళ్ళినప్పుడు పోలీసులు మొదట అసలు పట్టించుకోలేదు. సామాజిక సంస్థల జోక్యం తరువాత కూడా కేసుని సరిగ్గా ఫైల్ చేయలేదు. సాక్ష్యాలను నాశనం చేయడంతో పాటూ, తప్పుడు రికార్డు సృష్టించడం జరిగిందని ఆమె తరపున నిలిచిన న్యాయవాదుల ఆరోపించారు. చివరికి బిల్కిస్ బానో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సిబిఐ విచారణ చేయాలని, గుజరాత్‌లో ఈ కేసు విచారణ జరిగితే తనకు అక్కడ న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని, ముంబైకి కేసు బదిలీ చేయాలని కోరింది. 2003లో సుప్రీం కోర్టు కేసును సిబిఐకి బదిలీ చేసింది. కేసు విచారణ కూడా ముంబై కోర్టుకి మారింది.

2008 లో ముంబై ప్రత్యేక న్యాయస్థానం 11 మందిని దోషులుగా నిర్ధారిస్తూ వారికి జీవిత ఖైదును విధించింది. మరికొందరు పోలీసులు, డాక్టర్లు కూడా సాక్ష్యాధారాలు నాశనం చేసినందుకు, దోషులు అయ్యారు. మొత్తం మీద 20మందిపై అభియోగాలు మోపబడ్డాయి. నేరస్థులు అప్పీల్‌కి వెళ్లారు. 2017లో ముంబై హైకోర్టులో అనేక వాదోపవాదాల తరువాత వారి నేరాన్ని, జీవిత ఖైదీ శిక్షను ధ్రువీకరిస్తూ తీర్పునిచ్చింది. ఆ తరువాత సుప్రీం కోర్టులో నేరస్థులు అప్పీల్ చేసుకున్నారు. సుప్రీం కోర్టు రెమిషను (శిక్ష తగ్గింపు) ఇవ్వవచ్చునో లేదో నిర్ణయించి అధికారాన్ని ఆశ్చర్యకరంగా గుజరాత్ ప్రభుత్వానికి ఇచ్చింది. గుజరాత్ అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం, 2022లో ఆగస్టు 15 సందర్భంగా ఇచ్చే క్షమాభిక్షలో భాగంగా 11 మంది దోషుల శిక్షాకాలం ముగియక ముందే, వారు సత్ప్రవర్తన కలిగి ఉన్నారని, అప్పటికే 14 ఏళ్ళు శిక్షాకాలం అనుభవించారని అంటూ వారిని విడుదల చేసింది. దేశ స్వాతంత్య్ర దినం పండుగనాడు, మన దేశ ప్రధాని ఎర్రకోటపై నిలిచి, స్త్రీల రక్షణకోసం తమ ప్రభుత్వం బేటీ బచావ్, నారీ శక్తి వంటి పథకాలను ప్రవేశపెట్టామని ఉపన్యాసం ఇస్తున్నప్పుడు, అవును సరిగ్గా అప్పుడే బిల్కిస్ బానోపై అత్యాచారానికి, కుటుంబ సభ్యులపై హత్యలకి పాల్పడ్డ ఈ నేరస్థులు జైలునుండి విడుదలై విజయగర్వంతో ఎంతో దర్పంగా బయటకు వచ్చారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి జైలునుండి విడుదలై వచ్చిన వారిలా, ఆ నేరస్థుల మెడలో పూలదండలు వేసి ఊరేగించటం, స్వీట్లు పంచడం, నినాదాలు ఇవ్వడం అనేక మందికి బాధను, ఆగ్రహాన్ని కూడా కలిగించింది. దేశవ్యాప్తంగా అనేక మంది బిల్కిస్ బానోకి న్యాయం జరగలేదని అంటూ గుజరాత్‌లో బిజెపి ప్రభుత్వ వైఖరిని, న్యాయ వ్యవస్థ తీరును తీవ్రంగా విమర్శించారు.

2024, జనవరి 8వ తేదీ బిల్కిస్ బానో కేసులో అపెక్స్ కోర్టు రెమిషన్‌ను రద్దు (క్వాష్) చేసింది. ఈ కేసు విచారణ మహారాష్ట్రలో జరిగిందని, శిక్ష కాలాన్ని తగ్గించవచ్చా, లేదా అనే నిర్ణయం తీసుకునే అధికారం వారికి మాత్రమే ఉంటుంది తప్ప, ఈ విచారణతో ఏ సంబంధం లేని గుజరాత్ ప్రభుత్వానికి ఉండదని తేల్చి చెప్పింది. జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ శిక్ష కాలాన్ని గుజరాత్ ప్రభుత్వం శిక్ష తగ్గించి వీరిని విడుదల చేయడాన్ని తీవ్ర పదజాలంతో విమర్శించింది. జనవరి 8, 2024న అపెక్స్ కోర్టు గుజరాత్ ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దోషులు రెండు వారాల్లో తిరిగి జైలుకు రావాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కోర్టుల్లో ఇంకా కొంచెం న్యాయబద్ధంగా వ్యవహరించే వాళ్ళు వున్నారని అనిపించింది. కానీ ఇది అతి కొద్ది సమయమే. ఇప్పుడు మళ్లీ సుప్రీం కోర్టులో ఇద్దరు జడ్జిలు జీవిత ఖైదు శిక్షపడిన ఇద్దరినీ 17 సంవత్సరాల శిక్ష అనుభవించారని వారిలో ఒకరికి తీవ్రమైన వైకల్యం ఉందని అంటూ బెయిల్ మంజూరు చేసింది.

బిల్కిస్ బానో కేసులోనే కాదు, నరోడా పాటియాలా లో జరిగిన 97మంది ముస్లింల ఊచకోత కేసులోనూ ప్రత్యేక కోర్టు మాజీమంత్రి మాయ కొడ్నానీ, బజరంగ్‌దళ్ నేత బాబు బజరంగి తోసహా మరో 32మందిని దోషులుగా తెలిపింది. కాగా ఆ తరువాత గుజరాత్ కోర్టు, మాయా కొడ్నవీని, మరో 17మందిని నిర్దోషులు అని చెప్తూ విడుదల చేసింది. మాజీ ఎంపి ఎహసాన్ జాఫరీతో సహా 69మంది దారుణంగా చంపబడ్డ గుల్బర్గ్ సొసైటీ ఘటనలోనూ దోషులుగా నిర్ధారించి, జీవిత ఖైదు విధించబడిన వాళ్లతో సహా 36 మందిని తిరిగి నిర్దోషులుగా విడుదల చేశారు. ఉన్నత స్థాయిలో కుట్ర జరిగిందని ఆరోపిస్తూ అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, కొందరు అధికారులపై ఈ ఘటనలో మరణించిన ఎంపి భార్య జాకీయా వేసిన కేసు అనేక ఏళ్ళు నడిచింది. 2022 లో సిట్ వీరికి క్లీన్ చిట్ ఇచ్చింది అని అంటూ కోర్టు కేసు కొట్టివేసింది. ఏళ్ల తరబడి జా ఫ్రీ కోర్టుల చుట్టూ తిరుగుతూ న్యాయ పోరాటం చేసి, అలసి 2025 లో మరణించింది. 14మంది మరణించిన బెస్ట్ బేకరీ, 33మంది చనిపోయిన సర్దార్ పూర్ కేసుల్లోను న్యాయం బాధితుల పట్ల అన్యాయంగానే వ్యవహరించింది.

మన దేశస్వాతంత్య్ర పోరాటంలో ముస్లింలు గణనీయంగా పాల్గొన్నారు. నాయకత్వం వహించారు. మన రాజ్యాంగంలో ప్రకటించుకున్నట్లు కుల, మత, లింగ, వివక్షలు లేని, లౌకిక ప్రజాస్వామిక విలువల ప్రాతిపదికన నడవాల్సిన పాలనా వ్యవస్థలలో, పౌర సమాజంలో ఇప్పుడు ఒక నిట్టనిలువు చీలిక, ఏమి కూడదు అని మనం అనుకున్నామో, ఆ ప్రాతిపదికనే జరుగుతూ ఉంది. ముస్లింల పట్ల తీవ్ర అసహనాన్ని, విద్వేషాన్ని బాహటంగానే ప్రదర్శించటం, వారిని రెండవ తరగతి పౌరులుగా చూడడం అనేది ఇప్పుడు సమాజంలో స్థిరీకరణ పొందింది. ముస్లింల స్థితిగతులను అంచనా వేసేందుకు, సంస్కరణలను చేపట్టేందుకు ఉద్దేశించిన సచార్ కమిటీ నివేదిక బుట్టదాఖలు అయిపోయింది. దాని గురించి మాట్లాడే వారే లేరు ఇప్పుడు. శిక్షపడ్డాక కూడా బెయిల్, పెరోల్ పేరిట నెలల తరబడి బయటకు వస్తూ పోతూ ఉన్న ఆ నేరస్థులు 17 ఏళ్ల కన్నా తక్కువే శిక్ష అనుభవించినా, వారిని క్షమిద్దామని అనుకుంటున్న న్యాయస్థానం, నిజంగా బిల్కిస్ బానోకి న్యాయం చేసే వ్యవస్థనే ఇంకా అని అనుకోవచ్చా? అయిన వాళ్లందర్నీ కోల్పోయి, జైలు ఊచలు లేని బయట సమాజంలో 24 ఏళ్లుగా చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న ఆమెకి ఉపశమనం దొరుకుతుందా ఎప్పటికైనా? ఈ న్యాయ పోరాటంలో న్యాయం, బిల్కిస్ బానోపట్ల ఘోర అన్యాయానికి పాల్పడింది మళ్ళీ మరోసారి.


విమల (రచయిత్రి సామాజిక విశ్లేషకులు)

Tags

Next Story