ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్

Ecological action thriller
X

Ecological action thriller

వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు సత్యదేవ్ ‘సమవర్తి’ అనే ఆసక్తికరమైన సినిమాలో నటిస్తున్నారు. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న 16వ చిత్రమిది. ఈ సినిమాను రుద్ర పిక్చర్స్ బ్యానర్, పంచభూత ప్రొడక్షన్స్‌పై శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్.వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

శనివారం ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ శశిధర్ మాట్లాడుతూ - “సత్యదేవ్ అన్న ఈ సినిమాతో పెద్ద సక్సెస్ అందుకోబోతున్నాడు. ‘సమవర్తి‘ సినిమా థియేటర్స్‌లో మ్యాజిక్ చేయబోతోంది”అని అన్నారు. డైరెక్టర్ అజయ్ నాగ్.వి. మాట్లాడుతూ “సత్యదేవ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారు అనేది టీజర్‌లో చూశారు. శ్రీకాంత్ క్యారెక్టర్ ఈ కథకు చాలా కీలకం”అని పేర్కొన్నారు. హీరో సత్యదేవ్ మాట్లాడుతూ “దక్షిణ భారత్‌లో ఎన్ని అడవులు ఉన్నాయో అన్నింట్లో మేము షూటింగ్ చేశాం. చిత్రీకరణ సమయంలో అడవి జంతువులను, పాములను చూశాం. మాకొక గ్రేట్ అడ్వెంచర్ అనిపించింది. థియేటర్స్‌లో మీకూ అదే ఫీల్ కలిగిస్తుంది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, గానవి లక్ష్మణ్, శివచరణ్ రెడ్డి జక్కిడి, వినయ్ రెడ్డి. మోహన్ భగత్, ఆదిత్య, హర్ష మల్లికార్జున, దేవ్ దీప్ పాల్గొన్నారు.

Next Story