ఒంటరితనం.. లాభసాటి వ్యాపారం

ఒంటరితనం వ్యాపారంలో అత్యంత లాభదాయకమైన, సున్నితమైన భాగంగా రహస్య డేటింగ్ యాప్‌లు అవతరించా యి. గ్లీడెన్, ప్యూర్, ఆష్లే మ్యాడిసన్ వంటి ప్రైవేట్ వేదికలు వినియోగదారుల అనామకతను ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాయి. ఉదాహరణకు, ఎక్స్‌ట్రా- మారిటల్ డేటింగ్ యాప్ ‘గ్లీడెన్’ ఒక్క భారత్‌లోనే ఏకంగా 40 లక్షల (4 మిలియన్లు) వినియోగదారుల మైలురాయిని దాటింది. ఇందులో హైదరాబాద్ (17%), బెంగళూరు (18%), ఢిల్లీ, ముంబై నగరాలు ప్రధాన పాత్ర పోషిస్తుండగా, మహిళల నమోదులో 148 శాతం వృద్ధి నమోదవడం గమనార్హం. సాధారణ డేటింగ్ యాప్‌లలో వినియోగదారుడి సగటు వార్షిక రాబడి 15 నుంచి 20 డాలర్లు ఉంటే, ఈ రహస్య యాప్‌లలో ఇది ఏకంగా 50 డాలర్లు (రూ. 4,200 పైగా) దాటుతోంది. పే-పర్-మెసేజ్, చాటింగ్ క్రెడిట్లు, ప్రైవేట్ ఫిల్టర్ల పేరిట ఈ కంపెనీలు శరవేగంగా లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ, కుటుంబ వ్యవస్థల్లో అశాంతి, బ్లాక్ మెయి లింగ్ మోసాలకు ఇవి దారితీస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం మనుషులను ప్రపంచానికి అనుసంధానించామని చెబుతున్న ప్పటికీ, క్షేత్రస్థాయిలో అది తీవ్రమైన ఏకాంతాన్ని, సామాజిక దూరాన్ని వదిలిపెట్టింది.
మానవ జీవితంలో ఏకాంతం అనేది కేవలం ఒక వ్యక్తిగత మానసిక వేదన మాత్రమే కాదు, అది ఆధునిక డిజిటల్ యుగంలో వందల బిలియన్ డాలర్ల టర్నోవర్‌తో వర్ధిల్లుతున్న అత్యంత లాభదాయకమైన ‘లోన్లీనెస్ ఎకానమీ’ (ఒంటరితనం ఆధారిత ఆర్థిక వ్యవస్థ) గా అవతరించింది. క్రమబద్ధమైన శారీరక క్షీణత, హృద్రోగాలు, తీవ్రమైన కుంగుబాటు (డిప్రెషన్), సోషల్ యాంగ్జయిటీకి దారితీస్తున్న ఈ ఏకాంతాన్ని ప్రపంచ ఆరోగ్య నిపుణులు తీవ్రమైన ముప్పుగా హెచ్చరిస్తున్నారు. రోజుకు 15 సిగరెట్లు తాగడం వల్ల శరీరానికి కలిగేంత నష్టం సుదీర్ఘకాలపు ఒంటరితనం వల్ల జరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషిస్తుండగా, మనుషుల్లోని ఈ భావోద్వేగ రహిత ఖాళీ తనాన్నే డిజిటల్ వేదికలు, సామాజిక మాధ్యమాలు తమ ప్రధాన పెట్టుబడిగా మార్చుకుని ప్రపంచవ్యాప్తంగా వేల కోట్లు కొల్లగొడుతున్నాయి.
మనుషుల నిశ్శబ్దాన్ని, ఏకాంతాన్ని నిరంతరం సొమ్ము చేసుకోవడంలో బిగ్ టెక్ సంస్థలు ముందు వరసలో ఉన్నాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి సామాజిక మాధ్యమాలు తమ అల్గారిథమ్‌ల ద్వారా వినియోగదారులను గంటల తరబడి స్క్రీన్‌లపై ఉంచుతూ ‘అటెన్షన్ ఎకానమీ’ని నడుపుతున్నాయి. మెటా సంస్థ ఏడాదికి సుమారు 130 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 10.8 లక్షల కోట్లు) పైగా ప్రకటనల రాబడిని పొందుతుండగా, మానవ అనుబంధాల కోరికను ఆసరాగా చేసుకుని ‘మ్యాచ్ గ్రూప్’ ఏడాదికి 3.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 28 వేల కోట్లు), ‘బంబుల్’ 1 బిలియన్ డాలర్ల వార్షిక రాబడి సాధిస్తున్నాయి.ఇందుకు తోడు ‘క్యారెక్టర్ ఎఐ’ , ‘రెప్లికా’ వంటి కంపెనీలు చాట్‌బాట్‌లను అందుబాటులోకి తెచ్చి మిలియన్ల మంది ఒంటరి వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. పారాసోషల్ సంబంధాల ద్వారా ‘ఓన్లీఫ్యాన్స్’ ఏటా 6.6 బిలియన్ డాలర్ల లావాదేవీలను నమోదు చేస్తూ, 1.3 బిలియన్ డాలర్ల (రూ. 10,800 కోట్లు) నికర ఆదాయాన్ని ఆర్జిస్తోంది.
స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ల పరిమితులను దాటి, ఆఫ్‌లైన్‌లో నేరుగా కలవాలనే తపనతో భారత్‌లోని హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి ఐటి నగరాల్లో ‘లెట్స్ సోషలైజ్’ భావన కొత్త వ్యాపార రంగానికి ఊపిరి పోసింది. ద్వితీయ శ్రేణి నగరాల నుంచి వచ్చి మెట్రోలలో పనిచేస్తున్న ఐటి ఉద్యోగులు, యువతను అపరిచితులతో కలిపే ఆఫ్‌లైన్ మీటప్ యాప్‌లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వారాంతాల్లో అపరిచితులను ఒకే టేబుల్‌పైకి తెచ్చి డిన్నర్ మీటప్‌లు నిర్వహించే ‘టైమ్‌లెఫ్ట్’, స్పోర్ట్ డిస్కవరీ వేదిక ‘ప్లేయో’, ‘మీటప్’, ‘బంబుల్ బిఎఫ్‌ఎఫ్’ వంటి యాప్‌లు భారీగా వృద్ధి చెందుతున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లు సబ్‌స్క్రిప్షన్ల ద్వారానే కాకుండా, స్థానిక రెస్టారెంట్లు, కేఫ్‌లతో ఒప్పందాలు కుదుర్చుకుని ఒక్కో వ్యక్తి నుంచి ఈవెంట్‌కు రూ. 500 నుంచి రూ. 2,000 వరకు వసూలు చేస్తూ పటిష్టమైన రాబడి నమూనాను అమలు చేస్తున్నాయి.
ఈ ఒంటరితనం వ్యాపారంలో అత్యంత లాభదాయకమైన, సున్నితమైన భాగంగా రహస్య డేటింగ్ యాప్‌లు అవతరించాయి. గ్లీడెన్, ప్యూర్, ఆష్లే మ్యాడిసన్ వంటి ప్రైవేట్ వేదికలు వినియోగదారుల అనామకతను ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాయి. ఉదాహరణకు, ఎక్స్‌ట్రా- మారిటల్ డేటింగ్ యాప్ ‘గ్లీడెన్’ ఒక్క భారత్‌లోనే ఏకంగా 40 లక్షల (4 మిలియన్లు) వినియోగదారుల మైలురాయిని దాటింది. ఇందులో హైదరాబాద్ (17%), బెంగళూరు (18%), ఢిల్లీ, ముంబై నగరాలు ప్రధాన పాత్ర పోషిస్తుండగా, మహిళల నమోదులో 148 శాతం వృద్ధి నమోదవడం గమనార్హం. సాధారణ డేటింగ్ యాప్‌లలో వినియోగదారుడి సగటు వార్షిక రాబడి 15 నుంచి 20 డాలర్లు ఉంటే, ఈ రహస్య యాప్‌లలో ఇది ఏకంగా 50 డాలర్లు (రూ. 4,200 పైగా) దాటుతోంది. పే-పర్-మెసేజ్, చాటింగ్ క్రెడిట్లు, ప్రైవేట్ ఫిల్టర్ల పేరిట ఈ కంపెనీలు శరవేగంగా లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ, కుటుంబ వ్యవస్థల్లో అశాంతి, బ్లాక్ మెయిలింగ్ మోసాలకు ఇవి దారితీస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం మనుషులను ప్రపంచానికి అనుసంధానించామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అది తీవ్రమైన ఏకాంతాన్ని, సామాజిక దూరాన్ని వదిలిపెట్టింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు మానవ ఉద్వేగ బలహీనతను కోట్లాది డాలర్ల వ్యాపార నమూనాగా మార్చుకుని లాభపడుతుండగా, సామాజిక అనుబంధాల లోపం తో మనుషులు మానసిక, ఆర్థిక నష్టాలను మూటగట్టుకుంటున్నారు. సమాజంలో ఆత్మీయమైన మానవ బంధాలు పునరుదరణకానంత వరకు ఈ ‘ఒంటరితనం ఆధారిత ఆర్థిక వ్యవస్థ’ మరిన్ని కొత్త రూపాల్లో విస్తరిస్తూనే ఉంటుంది.
(మన తెలంగాణ స్పెషల్ డెస్క్)
Tags
-
Home
-
Menu
