‘కల్ట్’ వచ్చేది అప్పుడే

That’s when ‘Cult’ arrives.
X

That’s when ‘Cult’ arrives.

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ తన ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్ట్’తో రాబోతున్నా రు. విభిన్నమైన కథాంశాలతో ప్రయోగాలు చేసే విశ్వక్ ఈ చిత్రంలో నటించడంతో పాటు దర్శకత్వం, కథ, స్క్రీన్‌ప్లే కూడా రాస్తూ ప్రా జెక్ట్ పూర్తి బాధ్యతలను తీసుకున్నారు. తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కాకర్ల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఇండియాస్ ఫస్ట్ అథెంటిక్ స్లాష ర్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. నిజ జీవితం లో జరిగిన కొన్ని కలవరపరిచే సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. డార్క్, ఇంటెన్స్, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.

తాజా గా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ను థ్రిల్లింగ్ గ్లింప్స్ ద్వారా ప్రకటించారు. అక్టోబర్ 30 నుంచి ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు కొత్త సినిమాటిక్ అనుభూతిని అందించనుం ది. రిలీజ్ డేట్ గ్లింప్స్ మరోసారి సినిమా కథా నేపథ్యంపై ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా విశ్వక్ సేన్ తొలిసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యా రెక్టర్‌లో కనిపించబోతున్నట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ, అనిరుధ్ భాస్కర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీ, ఇంగ్లిష్, జపనీస్, స్పానిష్ భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Tags

Next Story