గోదావరి నీటి హక్కులపై వెనక్కి తగ్గేది లేదు : హరీష్ రావు

గోదావరి నీటి హక్కులపై వెనక్కి తగ్గేది లేదు : హరీష్ రావు
X

మన తెలంగాణ – హైదరాబాద్: తెలంగాణను కరువు కాటకాలకు గురిచేసిందే కాంగ్రెస్ పార్టీ అని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించడం తప్పా? అని ప్రశ్నించారు తెలంగాణ నీటి హక్కుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరుపై బిఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..

అబద్ధాలు చెప్పినంత మాత్రాన అవి నిజాలు కావని, సిఎం రేవంత్‌రెడ్డిలో అసహనం పెరిగిపోయిందని, పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా మార్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని విమర్శించారు.. గోదావరిలో తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని కోరడం తప్పా? అని హరీష్ రావు ప్రశ్నించారు.

గులాబీ జెండా పుట్టకముందు తెలంగాణ నీటి హక్కుల గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడారా? టిడిపికి విధేయులుగా ఉన్న సమయంలో పోతిరెడ్డిపాడు అంశంపై ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. జూరాల ప్రాజెక్టును నిర్మించి నిరుపయోగంగా వదిలేశారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో కర్ణాటకకు బకాయిలు చెల్లించకపోవడం వల్లే జూరాల ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నీరు అందలేదని ధ్వజమెత్తారు.

ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును బలోపేతం చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని నేతలు తెలిపారు. ఎస్ఆర్ఎస్పి నుంచి ధవళేశ్వరం వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టునైనా నిర్మించిందా? అని ప్రశ్నించారు.

మాజీసిఎం కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎవరూ ధైర్యం చేసి మాట్లాడలేదని, రేవంత్‌రెడ్డి సిఎం అయిన తర్వాతే చంద్రబాబుకు ధైర్యం వచ్చిందని విమర్శించారు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ విషయంలో బిఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని హరీష్ రావు స్పష్టం చేశారు.

Tags

Next Story