బంగారం ఆల్ టైమ్ రికార్డు.. తులం రూ.1,18,900

Gold Rate Touches Rupees 1 Lakh
X

Gold Rate Touches Rupees 1 Lakh

పది గ్రాముల పసిడి ధర రూ.1,18,900 ఒక్క రోజే రూ.2,700 పెరిగిన రేటు కిలో వెండి రూ.3,220 పెరిగి రూ.1,39,600కి చేరిక న్యూఢిల్లీ : బంగారం, వెండి ధరలు రోజు రోజుకీ పరుగులు పెడుతూనే ఉ న్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మం గళవారం 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.2700 పెరిగి రూ. 1,18,900కు చేరుకుంది. సురక్షితమైన ఆస్తిగా ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరగడం, అమెరికా హెచ్1బి వీసా పెంపు నేపథ్యంలో రూపాయి విలువ […]

పది గ్రాముల పసిడి ధర రూ.1,18,900
ఒక్క రోజే రూ.2,700 పెరిగిన రేటు
కిలో వెండి రూ.3,220 పెరిగి రూ.1,39,600కి చేరిక
న్యూఢిల్లీ : బంగారం, వెండి ధరలు రోజు రోజుకీ పరుగులు పెడుతూనే ఉ న్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మం గళవారం 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.2700 పెరిగి రూ. 1,18,900కు చేరుకుంది. సురక్షితమైన ఆస్తిగా ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరగడం, అమెరికా హెచ్1బి వీసా పెంపు నేపథ్యంలో రూపాయి విలువ భారీగా పడిపోవ డం వంటివి బంగారం ధర పెరుగుదలకు కారణవుతున్నాయి. ఆల్ ఇండి యా సరఫ అసోసియేషన్ ప్రకారం, క్రితం రోజు 99.9 శాతం స్వచ్ఛత బంగారం ధర రూ.1,16,200 (10 గ్రాములు) వద్ద ముగిసింది. స్థానిక బులియన్ మార్కెట్లో 99.5 శాతం స్వచ్ఛత పసిడి రికార్డు స్థాయిలో రూ. 1,18,300 (10 గ్రాములు)కు చేరింది.

ఇది సోమవారం రూ.1,15,650 ధరతో పోలిస్తే రూ.2,650 వద్ద ముగిసింది. ట్రేడర్ల ప్రకారం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ గణనీయంగా పడిపోయింది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.39,950 (50.60 శాతం) పెరిగింది. 2024 డిసెంబర్ 31న పసిడి ధర రూ.78,950 వద్ద ఉంది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. మంగళవారం కిలో వెండి ధర రూ.3,220 పెరిగి రూ.1,39,600 కు చేరుకుంది. సోమవారం రోజు ఇది రూ.1,36,380 వద్ద ఉంది.

Tags

Next Story