కాంగ్రెస్ వచ్చాక బంగారం ధరలు కొండెక్కాయి

Harish Rao Roadshow in Husnabad
X

Harish Rao Roadshow in Husnabad

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ గేర్ లో వెళ్తోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా హుస్నాబాద్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై మిర్శనాస్త్రాలు సందించారు. కాంగ్రెస్ వచ్చాక బంగారం ధరలు కొండెక్కాయని హరీశ్ రావు తెలిపారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ హామీ అమలు కాలేదన్నారు. ఎన్నికల ప్రచారం ముగింపుకి సమయం దగ్గర పడుతుండడంతో నేతలు వరస సభలకు హాజరవుతూ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు.

Tags

Next Story