భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు

Heavy rains in Bhadradri Kothagudem
X

Heavy rains in Bhadradri Kothagudem

గుండాల: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి నది కూడా పొంగి ప్రవహిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నర్సాపురం, బేతాలపాడులో వర్షాలు అధికంగా కురవడంతో తుమ్మలవాగు ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తోంది. వరదనీరు కాజ్‌ వేపైకి చేరడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుండాల ఏజెన్సీలో భారీ వర్షం కురవడంతో లోలెవెల్ బ్రిడ్జి పైనుంచి వరద ప్రవహిస్తుండడంతో నాగారం, పాలగూడెం, కొడవటంచకు రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జి నిర్మించాలని ఏజెన్సీ వాసుల డిమాండ్ చేస్తున్నారు.  అధికారుల లోతట్టు […]

గుండాల: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి నది కూడా పొంగి ప్రవహిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నర్సాపురం, బేతాలపాడులో వర్షాలు అధికంగా కురవడంతో తుమ్మలవాగు ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తోంది. వరదనీరు కాజ్‌ వేపైకి చేరడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుండాల ఏజెన్సీలో భారీ వర్షం కురవడంతో లోలెవెల్ బ్రిడ్జి పైనుంచి వరద ప్రవహిస్తుండడంతో నాగారం, పాలగూడెం, కొడవటంచకు రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జి నిర్మించాలని ఏజెన్సీ వాసుల డిమాండ్ చేస్తున్నారు. అధికారుల లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పలు గ్రామాలు నీళ్లలో మునిగిపోయాయి.

Tags

Next Story