టాలీవుడ్‌లో నటించాలంటే కష్టం: మనసులో మాట చెప్పిన స్టార్ హీరోయిన్

It is difficult to act in Tollywood: Samyuktha Menon
X

It is difficult to act in Tollywood: Samyuktha Menon

తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టమని ప్రముఖ నటి సంయుక్త మీనన్ తెలిపారు. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కొంత కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న సంయుక్త స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మలయాళంతో పోలిస్తే తెలుగు చిత్రాల్లో నటిచాలంటే కష్టమన్నారు. తెలుగు భాషపై పట్టు లేకపోవడం ఒక కారణమైతే.. మేకప్ ఇంకో కారణం అన్నారు. వినడానికి వింతగా ఉన్న.. తన వరకు అదే చాలా పెద్ద విషయమన్నారు. మలయాళ చిత్రాల్లో చేసేటప్పుడు మేకప్ వేసుకోవడం వెంటనే అయిపోయేది... టాలీవుడ్ లో షాట్ చేస్తున్నప్పుడల్లా మేకప్ వేసుకోవాలని తెలిపారు. దీంతో చర్మం, ముఖ్యపై ఏదో ఉన్నట్లు అనిపిస్తోందని ఆసహనం వ్యక్తం చేశారు. అక్కడ లైట్ గా సహజంగా వేస్తారు. యాక్టింగ్ చేసేటప్పుడు స్వేచ్ఛ ఉన్నట్లు అనిపిస్తోంది. కానీ టావీవుడ్ లో స్వీయ జాగ్రత్తలు చాలా తీసుకోవలని తెలిపారు. సంయుక్త మీనన్ ప్రస్తుతం ఆమె నిఖిల్ 'స్వయంభూ'లో నటిస్తున్నారు.

Tags

Next Story