గద్వాల్ లో ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన లారీ: ఒకరు మృతి

Jogulamba Gadwal Erravalli
X

Jogulamba Gadwal Erravalli

ఎర్రవల్లి: జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలో బెంగళూరు-హైదరాబాద్ జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. జింకలపల్లి స్టేజి సమీపంలో జగన్ ట్రావెల్ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. 30 మంది ప్రయాణికులతో జగన్ ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్తుండగా మూత్ర విసర్జన కోసం బస్సును రోడ్డు పక్కన ఆపారు. ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో బ్యాక్ సీట్లో ఉన్న ధీరజ్ అనే వ్యక్తి దుర్మరణం […]

ఎర్రవల్లి: జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలో బెంగళూరు-హైదరాబాద్ జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. జింకలపల్లి స్టేజి సమీపంలో జగన్ ట్రావెల్ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. 30 మంది ప్రయాణికులతో జగన్ ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్తుండగా మూత్ర విసర్జన కోసం బస్సును రోడ్డు పక్కన ఆపారు. ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో బ్యాక్ సీట్లో ఉన్న ధీరజ్ అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతుడు అత్తాపూర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story