లవర్ గిఫ్ట్ కోసం జైలుకెళ్లాడు

Kanker district North Bastar region Chhattisgarh
X

Kanker district North Bastar region Chhattisgarh

రాయ్ పూర్: ప్రియురాలు కోసం ఓ భగ్నప్రేమికుడు బైక్ కొనేందకు బంధువుల ఇంట్లో బంగారు ఆభరణాలు దొంగతనం చేసి గిఫ్ట్ గా ఇచ్చాడు. దీంతో దొంగతనం బయటపడడంతో ప్రియుడ్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సంఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రం ఉత్తర బస్తర్ ప్రాంతం కాంకేర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... తామ్రధ్వజ్ విశ్వకర్మ అనే యువకుడు, కరుణ్ పటేల్(22) అనే యువతి గాఢంగా ప్రేమించుకున్నారు. ప్రియురాలు బైక్ గిఫ్ట్ […]

రాయ్ పూర్: ప్రియురాలు కోసం ఓ భగ్నప్రేమికుడు బైక్ కొనేందకు బంధువుల ఇంట్లో బంగారు ఆభరణాలు దొంగతనం చేసి గిఫ్ట్ గా ఇచ్చాడు. దీంతో దొంగతనం బయటపడడంతో ప్రియుడ్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సంఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రం ఉత్తర బస్తర్ ప్రాంతం కాంకేర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... తామ్రధ్వజ్ విశ్వకర్మ అనే యువకుడు, కరుణ్ పటేల్(22) అనే యువతి గాఢంగా ప్రేమించుకున్నారు. ప్రియురాలు బైక్ గిఫ్ట్ గా ఇవ్వాలని కోరింది. దీంతో బంధువుల ఇంట్లో రెండు లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.95 వేల నగదును అపహరించాడు. అనంతరం ప్రియురాలు భగ్న ప్రేమికుడు బైక్ గిఫ్ట్ గా ఇచ్చాడు. బంధువుల స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తామ్ర ధ్వజ్ దొంగతనం చేసినట్టుగా విచారణలో తేలడంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.

Tags

Next Story