ప్రేమపెళ్లి... యువకుడి కుటుంబ సభ్యులపై దాడి... యువతిని ఎత్తుకెళ్లారు

Keesara Medchal Malkajgiri
X

Keesara Medchal Malkajgiri

మేడ్చల్: ప్రేమ వివాహం చేసుకుందని యువకుడి ఇంటికెళ్లి వారిపై యువతి కుటుంబ సభ్యులు కత్తులు, రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి (Medchal Malkajgiri) జిల్లా కీసర (Keesara) మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నర్సంపల్లి గ్రామాని చెందిన యువతి యువకుడు శ్వేత, జలగం ప్రవీణ్ గత ఏడు సంవత్సరాల నుంచి గాఢంగా ప్రేమించుకున్నారు. శ్వేత కుటుంబ సభ్యుల ప్రేమపెళ్లికి అభ్యంతరం తెలపడంతో నాలుగు నెలల క్రితం ఆర్య సమాజ్‌కు వెళ్లి […]

మేడ్చల్: ప్రేమ వివాహం చేసుకుందని యువకుడి ఇంటికెళ్లి వారిపై యువతి కుటుంబ సభ్యులు కత్తులు, రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి (Medchal Malkajgiri) జిల్లా కీసర (Keesara) మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నర్సంపల్లి గ్రామాని చెందిన యువతి యువకుడు శ్వేత, జలగం ప్రవీణ్ గత ఏడు సంవత్సరాల నుంచి గాఢంగా ప్రేమించుకున్నారు. శ్వేత కుటుంబ సభ్యుల ప్రేమపెళ్లికి అభ్యంతరం తెలపడంతో నాలుగు నెలల క్రితం ఆర్య సమాజ్‌కు వెళ్లి వివాహం చేసుకున్నారు. ప్రవీణ్‌కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో వారం రోజుల క్రితం భార్య శ్వేతతో కలిసి ఇంటికి వచ్చాడు. శ్వేత కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో కత్తులు, కర్రలు తీసుకొని వచ్చి ప్రవీణ్, అతడి తల్లిదండ్రులపై దాడి చేశారు. అనంతరం శ్వేత కాళ్లు, చేతులు కట్టేసి బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్లిపోయారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

Tags

Next Story