మణుగూరులో ఆర్ టిసి డ్రైవర్ ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం

Kothagudem Bhadradri district Manuguru
X

Kothagudem Bhadradri district Manuguru

కొత్తగూడెం భద్రాద్రి: ఓవర్ డ్యూటీ వేస్తూ డిఎం ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆర్ టిసి డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ సంఘటన కొత్తగూడెం భద్రాద్రి జిల్లా మణుగూరు డిపోలో జరిగింది. ఆర్ టిసి డ్రైవర్ ఎస్ కె సైదులు సాహెబ్ ఆరోగ్యం బాగా లేకున్నా ఓవర్ డ్యూటీ వేస్తూ డిఎం ఇబ్బందులకు గురి చేస్తున్నారు.  అయితే ఇదే విషయాన్ని ఆర్ఎంకు డ్రైవర్ సైదులు చెప్పాడు.  సైదులు అభ్యర్థన మేరకు కండక్టర్ సర్వీస్ ఇవ్వాలని డిఎంకు ఆర్ఎం ఆదేశించారు. […]

కొత్తగూడెం భద్రాద్రి: ఓవర్ డ్యూటీ వేస్తూ డిఎం ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆర్ టిసి డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ సంఘటన కొత్తగూడెం భద్రాద్రి జిల్లా మణుగూరు డిపోలో జరిగింది. ఆర్ టిసి డ్రైవర్ ఎస్ కె సైదులు సాహెబ్ ఆరోగ్యం బాగా లేకున్నా ఓవర్ డ్యూటీ వేస్తూ డిఎం ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే ఇదే విషయాన్ని ఆర్ఎంకు డ్రైవర్ సైదులు చెప్పాడు. సైదులు అభ్యర్థన మేరకు కండక్టర్ సర్వీస్ ఇవ్వాలని డిఎంకు ఆర్ఎం ఆదేశించారు. దీంతో సైదులు అక్కడ నుంచి బయటకు వచ్చి ఎలుకల మందు తాగాడు. వెంటనే సైదులును కార్యాలయ సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేసి అతడి ప్రాణాలు కాపాడారు. కండక్టర్లు, డ్రైవర్లను డిఎంలు వేధింపులకు గురి చేస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. 70 శాతం డిపోలలో ఆర్ టిసి సిబ్బందిని డిఎం, ఆర్ఎం వేధింపులకు గురి చేస్తున్నారిన డ్రైవర్లు, కండక్టర్లు ఆరోపణలు చేస్తున్నారు.

Tags

Next Story