అత్యంత చౌకైన అడ్వెంచర్ బైక్‌లు ఇవే

అత్యంత చౌకైన అడ్వెంచర్ బైక్‌లు ఇవే
X

తక్కువ బడ్జెట్‌లో అడ్వెంచర్‌ బైక్‌ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్! భారత ఆటో మొబైల్ మార్కెట్లో అనేక బైక్‌ల కంపెనీలు తక్కువ ధరకే అడ్వెంచర్ మోటార్‌ సైకిళ్లను అందిస్తున్నాయి. వీటిలో హీరో, హోండా, కవాసకి, సుజుకి బైక్స్ ఉండటం విశేషం. ఇవి గుంతలు, బ్యాడ్‌ రోడ్లను ఇవి సులభంగా ఎదుర్కొంటాయి. సుదూర ప్రయాణాలలో బైక్ నడపడాన్ని ఇష్టపడితే ఈ బైక్స్ ఎంతో సహాయపడుతాయి. మరి మార్కెట్లో లభించే అత్యంత చౌకైన 5 అడ్వెంచర్ బైక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హీరో ఎక్స్‌పల్స్ 200 4V

భారతదేశంలో అత్యంత సరసమైన, ప్రజాదరణ పొందిన ఆఫ్-రోడ్ బైక్ ఇది. అడ్వెంచర్ రైడింగ్‌ను ఇప్పుడే ప్రారంభిస్తుంటే ఈ బైక్ సరైన ఎంపిక. ఇది లాంగ్ సస్పెన్షన్ ట్రావెల్, 220mm గ్రౌండ్ క్లియరెన్స్, డిజిటల్ మీటర్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను అందిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.48 లక్షల నుండి రూ.1.72 లక్షల మధ్య ఉంటుంది.

హోండా CB200X

వారాంతాల్లో సుదూర ప్రయాణాలు చేసే వారి కోసం ఈ బైక్ అద్భుతంగా ఉంటుంది. ఇందులో 184.4cc ఇంజన్ అందించారు. మస్కులర్ మరియు స్పోర్టీ ADV లుక్, సౌకర్యవంతంగా ఉండే సీటింగ్, ABS ఉన్నాయి. దీనికి విండ్‌స్క్రీన్ కూడా ఉంది. దీని ధర రూ.1.47 లక్షల నుండి రూ.1.55 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.

హీరో ఎక్స్‌పల్స్ 210

ఈ బైక్ హైవే, ఆఫ్-రోడ్ డ్రైవింగ్ రెండింటికీ అనుకూలంగా ఉంటుంది. ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కూడిన 210cc లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంది. ఇందులో కొత్త TFT డిజిటల్ కన్సోల్, ABS మోడ్‌లు కూడా ఉన్నాయి. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.66 లక్షల నుండి రూ.1.75 లక్షల మధ్య ఉంటుంది.

కవాసకి KLX230

ఈ కవాసకి బైక్ చాలా తేలికగా, దృఢంగా ఉంటుంది. ఇది ప్రత్యేకంగా కఠినమైన రోడ్లు, గుంతలుపై ప్రయాణించడానికి రూపొందించబడింది. ఇది 233cc ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.84 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

సుజుకి వి-స్ట్రోమ్ SX

ఈ సుజుకి బైక్ హైవే టూరింగ్, తేలికపాటి ఆఫ్-రోడింగ్ రెండింటికీ అనువైనది. ఇందులో 249cc ఇంజన్, విశాలమైన- సౌకర్యవంతమైన సీటు, ఇంకా టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్/SMS అలర్ట్‌లతో కూడిన సుజుకి కనెక్ట్ యాప్ ఉన్నాయి. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 211,600 నుండి ప్రారంభమవుతాయి.

Tags

Next Story