ఎచ్‌ఎండీ వైబ్ 2 ప్రో 5G లాంచ్..ధరెంతో తెలుసా?

ఎచ్‌ఎండీ భారత మార్కెట్లో సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఏడాది మే నెలలో ఎచ్‌ఎండీ వైబ్ 2 5G స్మార్ట్ ఫోన్ తీసుకురాగా, ఇప్పుడు ఎచ్‌ఎండీ వైబ్ 2 ప్రో 5G పేరిట మరో పరికరాన్ని విడుదల చేసింది. ఇది సరసమైన ధరలో ఉండటం విశేషం. కంపెనీ ఈ ఫోన్ కు డిస్ప్లే, కెమెరా, బ్యాటరీని అప్‌గ్రేడ్ చేసి ప్రో మోడల్‌గా తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ ఫోన్ ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఎచ్‌ఎండీ వైబ్ 2 ప్రో 5G
ఎచ్‌ఎండీ వైబ్ 2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అవి 6GB RAM + 128GB స్టోరేజ్‌తో కూడిన బేస్ వేరియంట్ ధర రూ.15,999 కాగా 8GB RAM + 128GB స్టోరేజ్‌తో కూడిన రెండవ వేరియంట్ ధర రూ.17,999గా నిర్ణయించారు. అయితే, లాంచ్ ఆఫర్ కింద వీటిని వరుసగా రూ.14,999. రూ.16,999 లకే కొనుగోలు చేయవచ్చు. కాగా, ఈ ఫోన్ సిల్వర్ మిస్ట్, ఆక్వా గ్రీన్, కాస్మిక్ పర్పుల్ రంగులలో అందుబాటులో ఉంది.
ఎచ్‌ఎండీ వైబ్ 2 ప్రో 5G ఫీచర్లు
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.78-అంగుళాల FHD+ LCD డిస్ప్లే ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 8GB వరకు LPDDR4X RAM, 128GB స్టోరేజ్‌తో పనిచేస్తుంది. ఈ HMD ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. దీనికి రెండు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్డేట్లు లభిస్తాయని కంపెనీ పేర్కొంది.
కెమెరాల విషయానికి వస్తే, ఎచ్‌ఎండీ వైబ్ 2 ప్రో 5G డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్లో ప్రైమరీ కెమెరాగా 64-మెగాపిక్సెల్ సోనీ IMX682 సెన్సార్‌ను అమర్చారు. దీనితో పాటు 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాను కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 13-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా అందించారు. ఈ ఫోన్ 22 భారతీయ భాషలకు మద్దతు ఇస్తుంది. AI ఫీచర్లలో కంటెంట్ డ్రాఫ్టింగ్, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, ప్లానింగ్ చేయడం వంటివి ఉన్నాయి. బ్యాటరీ గురించి మాట్లాడితే.. ఈ స్మార్ట్‌ఫోన్ 6,000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. దీనికి 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇది 5G కనెక్టివిటీ, డ్యూయల్ స్టీరియో స్పీకర్లకు సపోర్ట్ చేస్తుంది.
-
Home
-
Menu
