తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య భారీగా కొనసాగుతోంది. శనివారం ఉదయానికి తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. మరోవైపు నిన్న( శుక్రవారం) ఒక్కరోజే మొత్తం 72,408 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఇందులో 28,691 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా తిరుమల శ్రీవారి హుండీకి రూ.4.39 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, దర్శనం కోసం వచ్చే భక్తులు రద్దీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన సమయంతో తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
-
Home
-
Menu
