లావా నుంచి సరికొత్త బడ్జెట్ ఫోన్..లాంచ్ తేదీ ఇదే!

భారతీయ బ్రాండ్ లావా నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ రాబోతోంది. కంపెనీ లావా బోల్డ్ N4 ప్రో 5G పేరిట దీనిని విడుదల చేయనుంది. గత నెలలో టెక్ మార్కెట్లో విడుదలైన లావా బోల్డ్ N4 లైట్ సరసన ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ సంస్థ బోల్డ్ N4 లైనప్‌లో రెండవ మోడల్‌గా చేరనుంది. ఈ పరికరం లాంచ్ డేట్‌తో పాటు ఫోన్ కీలక ఫీచర్లు, డిజైన్, రంగుల ఎంపికలను కూడా కంపెనీ వెల్లడించింది. ఈ లావా స్మార్ట్‌ఫోన్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మైక్రోసైట్ ఈ ఫోన్ సెప్టెంబర్ 18న మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో విడుదల కానుందని ధృవీకరించింది.
ఈ ఫోన్ డిజైన్ పరంగా చూస్తే..ఫ్లాట్ రియర్ ప్యానెల్‌ను కలిగి ఉంది. దాని ఎగువ-ఎడమ మూలలో చతురస్రాకారపు రియర్ కెమెరా ఐలాండ్ ఉంటుంది. కెమెరా మాడ్యూల్‌లో నాలుగు కటౌట్‌లు ఉన్నాయి. వాటిలో ఒకటి LED ఫ్లాష్ కోసం కేటాయించారు. ఇది ఫ్లాట్ మిడ్-ఫ్రేమ్‌ను కూడా కలిగి ఉంది. ఫోన్‌కు ఎడమ వైపున పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి. ఈ కొత్త లావా బోల్డ్ N4 ప్రో 5Gలో 6,000mAh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ ఉండనుంది. కాగా, ఈ ఫోన్ ఇండియాలో గోల్డ్, బ్లూ రంగులలో అమెజాన్ వేదికగా అమ్మకానికి రానుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. లావా బోల్డ్ N4 ప్రో 5G సిమ్ ట్రే కూడా కుడి వైపున ఉంటుంది. ముందు భాగంలో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ ఉంటుంది. దీనిలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం కెమెరాను అమర్చారు. అయితే, ఫోన్ ప్రారంభ ధర, చిప్‌సెట్, డిస్‌ప్లే సైజు, ఛార్జింగ్ వేగం వంటి ఇతర వివరాలు ప్రస్తుతం కంపెనీ వెల్లడించలేదు. లాంచ్ సమయంలో టెక్ సంస్థ ఈ వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
-
Home
-
Menu
