ఈ రెండు హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఏది కొంటే బెస్ట్?

ఈ రెండు హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఏది కొంటే బెస్ట్?
X

భారతీయ మార్కెట్లో అనేక కార్ల కంపెనీలు ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్లను అందిస్తున్నాయి. వీటి తక్కువ ధర, అధిక మైలేజ్ కారణంగా చాలామంది వీటిని కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఈ సెగ్మెంట్‌లో ప్రముఖంగా నిలిచే మోడళ్లలో మారుతి ఎస్ ప్రెస్సో, రెనాల్ట్, క్విడ్ ఉన్నాయి. తక్కువ ధర, మెరుగైన మైలేజ్, ఆధునిక ఫీచర్లతో ఈ రెండు కార్లు వినియోగదారులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. అయితే ఇంజిన్, ఫీచర్లు, ధర పరంగా ఏ కారు కొనుగోలు చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

మారుతి ఎస్ ప్రెస్సో వర్సెస్ రెనాల్ట్ క్విడ్ ఇంజిన్

మారుతి సుజుకి ఎస్ ప్రెస్సోలో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 68.52 PS పవర్, 91.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, AGS (ఆటో గేర్ షిఫ్ట్) ట్రాన్స్‌మిషన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. మారుతి ప్రకారం..ఈ కారు లీటర్ పెట్రోల్‌కు 24.12 కిమీ నుంచి 25.30 కిమీ వరకు మైలేజ్ అందిస్తుంది. మరోవైపు..రెనాల్ట్ క్విడ్‌లో కూడా 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ ఉంది. ఇది 69 PS పవర్, 92.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, AMT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి. మైలేజ్ విషయానికి వస్తే..క్విడ్ లీటర్ పెట్రోల్‌కు 21.46 కిమీ నుంచి 22.3 కిమీ వరకు ప్రయాణిస్తుంది.


మారుతి ఎస్ ప్రెస్సో వర్సెస్ రెనాల్ట్ క్విడ్ ఫీచర్లు

ఎస్ ప్రెస్సోలో లభించే ముఖ్యమైన ఫీచర్లు

1. రిమోట్ కీ-లెస్ ఎంట్రీ

2. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP)

3. హిల్ స్టార్ట్ అసిస్ట్

4. ABS, EBD

5.రివర్స్ పార్కింగ్ సెన్సర్లు

6.డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

క్విడ్‌లో లభించే అనేక ఆధునిక ఫీచర్లు

1. 184 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్

2. LED DRLs

3. పవర్ విండోలు

4. రిమోట్ కీ-లెస్ ఎంట్రీ

5. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్

6.20.32 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

7.ABS, EBD

9.డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్

10.రివర్స్ పార్కింగ్ సెన్సర్లు

11. రియర్ వ్యూ కెమెరా

12. హిల్ స్టార్ట్ అసిస్ట్

మారుతి ఎస్ ప్రెస్సో vs రెనాల్ట్ క్విడ్ ధర

మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో ప్రారంభ ధర రూ.3.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, టాప్ వేరియంట్ ధర రూ.5.27 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇక రెనాల్ట్ క్విడ్ ప్రారంభ ధర రూ.4.53 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, టాప్ వేరియంట్ ధర రూ.5.85 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

ఈ రెండిట్లో ఏ కారు కొంటే మంచిది?

బడ్జెట్, మైలేజ్‌కు ప్రాధాన్యత ఇస్తే మారుతి ఎస్ ప్రెస్సో మంచి ఎంపికగా నిలుస్తుంది. ఎక్కువ ఫీచర్లు, మెరుగైన డిజైన్, ప్రీమియం ఇంటీరియర్ కోరుకునేవారికి రెనాల్ట్ క్విడ్ ఆకర్షణీయమైన ఆప్షన్ అవుతుంది. అయితే, కొనుగోలు ముందు అవసరాలు, బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది.

Tags

Next Story