ప్రోటీన్లు పుష్కలంగా లభించే పప్పులు ఇవే

ప్రోటీన్లు పుష్కలంగా లభించే పప్పులు ఇవే
X

మన శరీరానికి ప్రోటీన్ ఎంతో అవసరం. ఎందుకంటే ఇది కండరాలను బలంగా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి డైట్‌లోఅధిక ప్రోటీన్ చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. చాలామంది ప్రోటీన్ అంటే గుడ్లు, పాలు, పనీర్, చికెన్, మటన్ వంటి ఆహారాలలో లభిస్తుందని అనుకుంటారు. అయితే రోజువారీ ఆహారంలో భాగమైన పప్పుధాన్యాలు, కాయధాన్యాలు కూడా ప్రోటీన్‌ను సమృద్ధిగా అందిస్తాయి. అంతేకాదు, వీటిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటి అనేక పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇప్పుడు ప్రోటీన్‌ను అందించే పప్పులు, కాయధాన్యాలు ఏమిటో తెలుసుకుందాం.


పెసర పప్పు

చాల తక్కువ ధరకే లభించే పప్పుల్లో పెసర పప్పు ఒకటి. ఇది తేలికగా జీర్ణమవుతుంది. దీనిని సాధారణ పప్పుగా మాత్రమే కాకుండా కిచిడి, పెసరట్టు, మొలకల రూపంలో తీసుకోవచ్చు. ఇందులో ప్రోటీన్‌తో పాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

మసూర్ దాల్

మసూర్ దాల్‌ను రోజువారీ ఆహారంలో సులభంగా చేర్చుకోవచ్చు. దీనిని పప్పు, సూప్ లేదా ఇతర వంటకాల రూపంలో తీసుకోవచ్చు. ఇందులో ప్రోటీన్‌ మాత్రమే కాకుండా ఫైబర్ కూడా ఉంటుంది. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

శనగ పప్పు

శనగ పప్పు రుచికే కాకుండా పోషక విలువలకూ ఎంతో ప్రసిద్ధి. దీనితో పప్పు, పకోడీలు వంటి అనేక వంటకాలు తయారు చేయవచ్చు. ఇందులో ప్రోటీన్, ఫైబర్ రెండూ సమృద్ధిగా లభిస్తాయి.

రాజ్మా

ఇందులో ప్రోటీన్‌తో పాటు ఫైబర్ కూడా మంచి మోతాదులో ఉంటుంది. రాజ్మాను సలాడ్లు, కర్రీలు మరియు ఇతర వంటకాలలో కూడా ఉపయోగించవచ్చు. ఇది మొక్కల ఆధారిత ప్రోటీన్‌కు మంచి మూలంగా పరిగణిస్తారు.

సోయాబీన్

ప్రోటీన్‌ను అధికంగా అందించే ఆహారాల్లో సోయాబీన్ ఒకటి. దీనిని నానబెట్టి ఉడికించి తినవచ్చు లేదా వివిధ వంటకాల రూపంలో తీసుకోవచ్చు. శాకాహారులకు ఇది ఉత్తమమైన ప్రోటీన్ వనరు.

ఈ విషయాలు గుర్తించుకోండి

ప్రతిరోజూ ఒకే రకమైన పప్పును తినడం కంటే వివిధ రకాల పప్పులను మారుస్తూ తీసుకోవడం మంచిది. పప్పులను రొట్టెలు లేదా అన్నంతో కలిపి తినడం వల్ల భోజనం మరింత సమతుల్యంగా మారుతుంది. దీంతో శరీరానికి అవసరమైన ప్రోటీన్‌తో పాటు ఇతర పోషకాలు కూడా అందుతాయి. పప్పులు, కాయధాన్యాలను ఎల్లప్పుడూ బాగా నానబెట్టి, పూర్తిగా ఉడికించి తినాలి. కొన్ని కాయధాన్యాల్లో ఉండే సహజ పదార్థాలు నానబెట్టడం, సరైన విధంగా వండడం ద్వారా తగ్గుతాయి. ముఖ్యంగా రాజ్మాను పూర్తిగా ఉడికించిన తర్వాత మాత్రమే తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

Tags

Next Story