బడ్జెట్ ధరలో శాంసంగ్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్

ప్రముఖ కంపెనీ శాంసంగ్ సరసమైన ధరలో సరికొత్త సరసమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. సంస్థ దీనిని శాంసంగ్ గెలాక్సీ A08 పేరిట విడుదల చేసింది. చాలా రోజుల నుంచి కొత్త ఫోన్ కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. శాంసంగ్ ఏ పరికరానికి తక్కువ ధరలోనే 6,000mAh బ్యాటరీ, 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాను జోడించింది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
శాంసంగ్ గెలాక్సీ A08 ధర, లభ్యత
శాంసంగ్ గెలాక్సీ A08 ఒకే ఒక్క వేరియంట్లో అందుబాటులో ఉంది. 4GB + 64GB వేరియంట్ ధర రూ.18,499. ఈ పరికరం డార్క్ బ్లూ, గ్రీన్, సిల్వర్ వంటి రంగులలో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ను శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, భాగస్వామ్య రిటైలర్లు, కంపెనీ వెబ్ సైట్, ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ అర్హత గల బ్యాంక్ కార్డులపై ఆరు నెలల వరకు, NBFC భాగస్వాముల ద్వారా తొమ్మిది నెలల వరకు నో-కాస్ట్ EMI ప్లాన్‌లను కూడా అందిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ A08 ఫీచర్లు
శాంసంగ్ గెలాక్సీ A08 స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల HD+ PLS LCD ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ పరికరం మీడియాటెక్ హీలియో G99+ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీనికి 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ జత చేశారు. మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ UI 9 పై పనిచేస్తుంది. ఆరు జెనరేషన్స్ OS అప్‌గ్రేడ్‌లు, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లకు మద్దతుతో వస్తుంది. గెలాక్సీ A08 ఫోన్ సర్కిల్ టు సెర్చ్ 3.0, జెమిని, పెర్‌ప్లెక్సిటీలకు సపోర్ట్ చేస్తుంది. వినియోగదారులు మాట్లాడటం ద్వారా లేదా పవర్ బటన్‌ను ఎక్కువసేపు నొక్కి ఉంచడం ద్వారా జెమిని, పెర్‌ప్లెక్సిటీలను యాక్సెస్ చేయవచ్చు. అదనంగా శాంసంగ్ గెలాక్సీ ఎకోసిస్టమ్‌లో భాగంగా ఈ ఫోన్ క్విక్ షేర్, మోడ్స్ అండ్ రొటీన్స్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
ఫోటోగ్రఫీ కోసం గెలాక్సీ A08లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో f/1.8 అపర్చర్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు f/2.4 అపర్చర్‌తో 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం f/2.0 అపర్చర్‌తో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే..శాంసంగ్ గెలాక్సీ A08లో 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6,000mAh బ్యాటరీని అమర్చింది. ఈ హ్యాండ్‌సెట్ 8mm మందంతో ఉంటుంది. ముందు భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ దుమ్ము, నీటి నిరోధకత కోసం IP64 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది.
-
Home
-
Menu
