లోన్ యాప్ నిర్వహకుల వేధింపులు.... వరంగల్ లో యువకుడు ఆత్మహత్య

Loan app administrators harassment
X

Loan app administrators harassment

హనుమకొండ: లోన్ యాప్ నిర్వహకులు వేధించడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.... ముల్కనూరు గ్రామంలో మాడుగుల అనిల్ అనే వ్యక్తి(29) ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను నిర్వహిస్తున్నాడు. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండడంతో లోన్ యాప్ నుంచి తొమ్మిది లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అప్పులు చెల్లించాలని లోన్ యాప్ నిర్వహకులు పలుమార్లు ఫోన్ చేసి అడిగారు. లోన్ యాప్ నిర్వహకుల వేధింపులు ఎక్కువగా కావడంతో తట్టుకోలేక పురుగుల మందు తాగాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు వరంగల్‌లోని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. అతడు అక్కడి చికిత్ప పొందుతూ చనిపోయాడు.

లోన్ యాప్ నుంచి లోన్ తీసుకున్నప్పుడు బాధితుల ఫోన్‌లోని నంబర్లతో పాటు ఇంటి పేరు మీద ఉన్న నంబర్లను యాప్ నిర్వహకులు హ్యాక్ చేస్తారని ఐటి నిపుణులు చెబుతున్నారు. బాధితులకు సంబంధించిన బంధువులు, గ్రామస్థులకు ఫోన్ చేసి పలానా వ్యక్తి తెలుసా అని అడుగుతారు. తెలుసు అని చెప్పగానే మీ ఫోన్ నంబర్ చెప్పి మా వద్ద లోన్ తీసుకున్నాడని యాప్ నిర్వహకులు చెబుతారు. బాధితుల దగ్గరి బంధువులకు లోన్ యాప్ నిర్వహకులు ఫోన్ చేసి పలుమార్లు వేధించడంతోనే బాధితులు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సమాచారం. లోన్ యాప్ నిర్వహకులు వలలో చిక్కుకోవద్దని పోలీసులు సూచనలు చేస్తున్నారు.

Tags

Next Story