పెళ్లిలో విషాదం.. కాలుజారి వ్యక్తి మృతి

పెళ్లిలో విషాదం.. కాలుజారి వ్యక్తి మృతి
X

మన తెలంగాణ/గోపాల్‌పేట: ప్రమాదవశాత్తు కాలుజారీ వ్యక్తి మృతి చెందిన సంఘటన గోపాల్‌పేట మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఏదుల గ్రామానికి చెందిన గొల్ల దేవరి వెంకటయ్య తండ్రి కర్రన్న (64) మంగళవారం ఉదయం 11 గంటలకు తన గ్రామస్తుడు కొమ్ము వెంకటయ్యతో కలిసి చాకలపల్లి శేషిరెడ్డి కుమార్తె నిశ్చితార్థానికి హాజరు కావడానికి బైక్ పై గోపాల్‌పేటకు వచ్చి మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో వెంకటయ్య గోపాల్‌పేటలోని పద్మావతి ఫంక్షన్ హాల్ […]

మన తెలంగాణ/గోపాల్‌పేట: ప్రమాదవశాత్తు కాలుజారీ వ్యక్తి మృతి చెందిన సంఘటన గోపాల్‌పేట మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఏదుల గ్రామానికి చెందిన గొల్ల దేవరి వెంకటయ్య తండ్రి కర్రన్న (64) మంగళవారం ఉదయం 11 గంటలకు తన గ్రామస్తుడు కొమ్ము వెంకటయ్యతో కలిసి చాకలపల్లి శేషిరెడ్డి కుమార్తె నిశ్చితార్థానికి హాజరు కావడానికి బైక్ పై గోపాల్‌పేటకు వచ్చి మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో వెంకటయ్య గోపాల్‌పేటలోని పద్మావతి ఫంక్షన్ హాల్ వద్ద భోజనం తర్వాత చేయి కడుక్కోవడానికి వెళ్లి కాలు జారీ నేలపై పడి మరణించాడని అన్నారు. మృతుని భార్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్నామన్నారు.

Tags

Next Story