చెంచా చూపించి పోస్టాఫీసును దోచుకోబోయాడు! (వీడియో)

Man tries to rob a UK post office
X

Man tries to rob a UK post office

ఓ దొంగ పోస్టాఫీసులోకి దూరి పెద్ద చెంచాను చూపించి, అందరినీ హడలెత్తించాడు. అతని చేతిలో ఉన్నది కత్తి అని భావించిన సిబ్బంది బెంబేలెత్తిపోయారు. అయితే పోస్టాఫీసు సిబ్బందిలో ఒకరు, ఆ దొంగ వాలకం గమనించి, గ్యాస్ బటన్ నొక్కడంతో కంగారు పడిన దొంగ అక్కడినుంచి ఉడాయించాడు. ఇంగ్లండ్ లోని నాటింగామ్ లో జరిగిన ఈ సంఘటనలో దొంగను పదిరోజుల తర్వాత పోలీసులు పట్టుకున్నారు.

నాటింగామ్ లోని హేసన్ గ్రీన్ పోస్టాఫీసులోకి చొరబడిన ఓ దొంగ పెద్ద చెంచాను తిరగేసి పట్టుకుని ‘మర్యాదగా డబ్బంతా ఇచ్చేయండి’ అంటూ సిబ్బందిని బెదిరించాడు. బెదిరిపోయిన సిబ్బంది డబ్బు ఇవ్వడానికి సిద్ధమవుతుండగా, దొంగ చేతిలో ఉన్నది చాకు కాదనీ, చెంచా అని పసిగట్టిన ఓ వ్యక్తి గ్యాస్ బటన్ నొక్కాడు. గ్యాస్ బయటకొచ్చి, ఎదురుగా ఏమీ కనిపించకపోవడంతో దొంగ పారిపోయాడు. అయితే ఈ కంగారులో తన డెబిట్ కార్డును దొంగ అక్కడే మరచిపోవడంతో పోలీసులు అతన్ని జెలానీ స్కాట్ గా గుర్తించి, పది రోజుల్లోనే అరెస్ట్ చేశారు.

అయితే తన మానసిక ఆరోగ్యం సరిగాలేదని, దొంగతనానికి వెళ్లే ముందు డ్రగ్స్ కూడా తీసుకున్నానని చెప్పాడు. న్యాయమూర్తి అతనిపై జాలిపడి ఆరునెలలపాటు మాదకద్రవ్యాల నివారణ కేంద్రంలో పనిచేయాలంటూ ఆదేశించారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు దోచుకోవడానికి వచ్చిన వ్యక్తికి శిక్ష వేయకుండా వదిలేయడం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags

Next Story