మెదక్ జిల్లాలో దారుణం.. కుమారుడి దాడిలో తల్లి మృతి!

మెదక్ జిల్లాలో దారుణం.. కుమారుడి దాడిలో తల్లి మృతి!
X

మన తెలంగాణ - క్రైమ్ డెస్క్: మెదక్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెద్ద శంకరంపేట మండలం శివయ్యపల్లిలో తల్లికి, కుమారుడికి మధ్య వివాదం తలెత్తింది. డబ్బుల విషయంలో తల్లితో కుమారుడు గొడవపడ్డాడు. ఈక్రమంలో ఆగ్రహానికి గురై ఆమెపై రోకలిబండతో దాడి చేశాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తల్లి మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.



Tags

Next Story