భువనగిరిలో మీనాక్షి చౌదరి మెరుపులు..గరుడ వస్త్రాలయం ప్రారంభంతో పట్టణంలో సందడి!

Meenakshi Chaudhary dazzles in Bhuvanagiri.
X

Meenakshi Chaudhary dazzles in Bhuvanagiri.

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం ఒక్కసారిగా సినీ కళతో వెలిగిపోయింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ మిస్ ఇండియా మీనాక్షి చౌదరి రాకతో భువనగిరి వీధుల్లో పండగ వాతావరణం నెలకొంది.

జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన గరుడ వస్త్రాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మీనాక్షి.. రిబ్బన్ కట్ చేసి షోరూంను లాంఛనంగా ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం షోరూంలోని వివిధ కలెక్షన్లను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు.

అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న మీనాక్షిని చూసేందుకు అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. చిరునవ్వుతో అభివాదం చేస్తూ మీనాక్షి అందరినీ ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. భువనగిరి ప్రజలకు అధునాతన ఫ్యాషన్, నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకే అందించాలనే లక్ష్యంతో గరుడ వస్త్రాలయంను తీసుకువచ్చామని తెలిపారు. పెళ్లిళ్లు, పండగల సీజన్‌కు తగ్గట్టుగా ప్రత్యేక కలెక్షన్లు, ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

సినీ తార సందడితో ప్రారంభమైన ఈ వేడుక భువనగిరి వస్త్ర ప్రియులకు కొత్త చిరునామాగా మారనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story