కొడుకు ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ముఖేశ్, నీతా అంబానీల ఆటా పాట (వీడియో)

Mukesh and Nita Ambani dance to Pyaar Hua Iqraar Hua
X

Mukesh and Nita Ambani dance to Pyaar Hua Iqraar Hua

ఆసియా కుబేరుడు ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల రెండో కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలు ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. గుజరాత్ లోని జామ్ నగర్ లో జరుగుతున్న మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో మొదటి రోజున దేశవిదేశాలనుంచి వచ్చిన అతిథులు ఉత్సాహంగా గడిపారు. స్వయంగా ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులు పాట పాడుతూ డాన్స్ చేయడం ఆహూతులను అలరించింది.

1955లో విడుదలై సూపర్ హిట్టయిన రాజ్ కపూర్ సినిమా శ్రీ420లోని “ప్యార్ హువా ఇక్ రార్ హువా హై” పాటను పాడుతూ, అంబానీ దంపతులు డాన్స్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. అంబానీ దంపతులు ఆసియాలోనే అత్యంత ధనవంతులన్న సంగతి తెలిసిందే. అంతటి ధనవంతులైనా, ఏ మాత్రం అహం లేకుండా అందరితో కలసిపోయి ఇంత సరదాగా గడ పడాన్ని నెటిజన్లు స్వాగతిస్తున్నారు.

Tags

Next Story