షార్ట్ సర్క్యూట్ కారణంగా అంధ బాలిక సజీవ దహనం

Narayanpet Maktal
మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్‌లో (Narayanpet Maktal) ఘోర విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని నంది నగర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా 12 ఏళ్ల బాలిక సజీవ దహనమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బాలికకు కళ్లు కనిపించవు, మతిస్థిమితం కూడా సరిగ్గా లేదు. ఆమె తల్లిదండ్రులు దినసరి కూలీలు. పనుల నిమిత్తం వారిద్దరు బయటకు వెళ్లిన సమయంలో కళ్లు కనిపించని బాలిక పొరపాటున వంట గదిలో ఉన్న ప్లగ్ వైర్లను లాగింది. దీంతో షార్ట్ […]
మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్‌లో (Narayanpet Maktal) ఘోర విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని నంది నగర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా 12 ఏళ్ల బాలిక సజీవ దహనమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బాలికకు కళ్లు కనిపించవు, మతిస్థిమితం కూడా సరిగ్గా లేదు. ఆమె తల్లిదండ్రులు దినసరి కూలీలు. పనుల నిమిత్తం వారిద్దరు బయటకు వెళ్లిన సమయంలో కళ్లు కనిపించని బాలిక పొరపాటున వంట గదిలో ఉన్న ప్లగ్ వైర్లను లాగింది. దీంతో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. కళ్లు కనిపించకపోవడంతో పాటు మతిస్థిమితకు కూడా లేని ఆ బాలిక ప్రమాదం నుంచి తప్పించుకోలేక సజీవ దహనమై మరణించింది. బాలిక మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని మక్తల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
-
Home
-
Menu