ఉట్కూర్‌లో విషాదం.. నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

Narayanpet Utkur
X

Narayanpet Utkur

ఉట్కూరు: నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోని (Narayanpet Utkur) తిమ్మారెడ్డిపల్లి తండాలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి ఇద్దరు చిన్నారులు నీటి గుంతలో పడి మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన పునియ నాయక్, జయమ్మ దంపతులకు అభి(5), ఆకాశ్(4) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు గత కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నప్పటికీ.. గణపతి నిమజ్జనం కోసం సొంతూరుకు వెళ్లారు. బుధవారం ఉదయం నిర్మాణ పనుల కోసం ఇంటి ఆవరణలో ఏర్పాటు […]

ఉట్కూరు: నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోని (Narayanpet Utkur) తిమ్మారెడ్డిపల్లి తండాలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి ఇద్దరు చిన్నారులు నీటి గుంతలో పడి మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన పునియ నాయక్, జయమ్మ దంపతులకు అభి(5), ఆకాశ్(4) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు గత కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నప్పటికీ.. గణపతి నిమజ్జనం కోసం సొంతూరుకు వెళ్లారు.

బుధవారం ఉదయం నిర్మాణ పనుల కోసం ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన నీటి గుంతలో ప్రమాదవశాత్తు పడ్డారు. ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. దీంతో చిన్నారులు మరణించారు. కొంత సమయం తర్వాత జయమ్మ పిల్లల కోసం వెతకితే ఆచూకీ లభించలేదు. ఆ ప్రాంతంలో ఉన్నవారు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే చిన్నారులను బయటకు తీసి జిల్లా (Narayanpet Utkur) ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారుల మృతితో తండాలో విషాదఛాయలు అలముకొన్నాయి.

Also Read : భూపాలపల్లిలో ప్రియుడితో కలిసి కూతురిని చంపి… క్షుద్రపూజలు చేసినట్టు నమ్మించింది

Tags

Next Story