వివిధ రాష్ట్రాలతో తెలంగాణకు జాతీయ రహదారులు అనుసంధానం: కిషన్ రెడ్డి

national highways crucial
X

national highways crucial

ఢిల్లీ: దేశాభివృద్ధికి జాతీయ రహదారుల పాత్ర చాలా కీలకమని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో కూడా అభివృద్ధికి సరైన అడుగులు పడుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..వివిధ రాష్ట్రాలతో తెలంగాణకు జాతీయ రహదారులు అనుసంధానం అయ్యాయని, జాతీయ రహదారుల నిర్వహణ వల్ల దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు తగ్గాయని తెలియజేశారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై తెలంగాణ రహదారులపై చర్చించానని, రాష్ట్రంలో రూ. 550 కోట్లతో నూతన రహదారులకు నిర్మాణం […]

ఢిల్లీ: దేశాభివృద్ధికి జాతీయ రహదారుల పాత్ర చాలా కీలకమని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో కూడా అభివృద్ధికి సరైన అడుగులు పడుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..వివిధ రాష్ట్రాలతో తెలంగాణకు జాతీయ రహదారులు అనుసంధానం అయ్యాయని, జాతీయ రహదారుల నిర్వహణ వల్ల దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు తగ్గాయని తెలియజేశారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై తెలంగాణ రహదారులపై చర్చించానని, రాష్ట్రంలో రూ. 550 కోట్లతో నూతన రహదారులకు నిర్మాణం చేపట్టాం అని పేర్కొన్నారు. రూ.860 కోట్లతో 422 కి.మి. రోడ్లను రాష్ట్రానికి మంజూరు చేశామని, రూ.30 వేల కోట్లకు పైగా నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read : హీరో జయం రవికి షాక్.. అతడి ఇల్లు వేలం

Tags

Next Story