పాలకుర్తిలో ఆస్తి కోసం కన్నతల్లిని చంపిన కూతురు

Palakurthi Jangaon
X

Palakurthi Jangaon

జనగామ: ఆస్తి కోసం కన్నతల్లిని కసాయి కూతురు చంపింది. ఈ సంఘటన  జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దతండాకు చెందిన లక్ష్మి అనే మహిళకు సంగీత అనే కూతురు ఉంది. ఐదేళ్ల క్రితం  వీరయ్య అనే యువకుడితో తన కూతురు పెళ్లి చేసింది. వివాహ సమయంలో కట్నం కింద లక్ష్మి తన ఎకరం భూమిలో 20 గుంటలు అమ్మి, ఆ డబ్బుతో 9 తులాల బంగారం చేయించి కూతురుకి కట్నం […]

జనగామ: ఆస్తి కోసం కన్నతల్లిని కసాయి కూతురు చంపింది. ఈ సంఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దతండాకు చెందిన లక్ష్మి అనే మహిళకు సంగీత అనే కూతురు ఉంది. ఐదేళ్ల క్రితం వీరయ్య అనే యువకుడితో తన కూతురు పెళ్లి చేసింది. వివాహ సమయంలో కట్నం కింద లక్ష్మి తన ఎకరం భూమిలో 20 గుంటలు అమ్మి, ఆ డబ్బుతో 9 తులాల బంగారం చేయించి కూతురుకి కట్నం కింద అప్పజెప్పింది. అయితే మిగిలిన భూమి, డబ్బు కూడా తనకు ఇవ్వాలని సంగీత తన తల్లిని పలుమార్లు వేధించింది. భూమి ఇవ్వనని లక్ష్మి నిరాకరించడంతో సంగీత తన భర్తతో కలిసి తల్లిని చంపేందుకు ప్లాన్ వేసింది. భర్తతో కలిసి లక్ష్మి నిద్రిస్తున్న సమయంలో ఆమె గొంతు నులిమి చంపింది. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఇండ్లు కూల్చడమేనా?

Tags

Next Story