అంగన్వాడీ టీచర్లకు శిక్షణ

Poshan Bhi Padhai Bhi
X

Poshan Bhi Padhai Bhi

మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లాలో మోత్కూర్ ఐసిడియస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో 'పోషణ్ భీ పఢయీ భీ' శిక్షణా కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ టీచర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ లో భాగంగా చిన్నారులకు సులభంగా అర్థమయ్యే విధంగా ప్రాక్టికల్ యాక్టివిటీలతో ఎలా భోదించాలో వివరించారు. ఈ సందర్భముగా ఐ సి డి ఎస్ సిడిపిఓ జ్యోత్స్న మాట్లాడుతూ పుట్టిన ప్రతి బిడ్డకు పోషణ ఎంత అవసరమో చదువు కూడా అంతే అవసరం అని అన్నారు. బాల్య […]

మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లాలో మోత్కూర్ ఐసిడియస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో 'పోషణ్ భీ పఢయీ భీ' శిక్షణా కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ టీచర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ లో భాగంగా చిన్నారులకు సులభంగా అర్థమయ్యే విధంగా ప్రాక్టికల్ యాక్టివిటీలతో ఎలా భోదించాలో వివరించారు. ఈ సందర్భముగా ఐ సి డి ఎస్ సిడిపిఓ జ్యోత్స్న మాట్లాడుతూ పుట్టిన ప్రతి బిడ్డకు పోషణ ఎంత అవసరమో చదువు కూడా అంతే అవసరం అని అన్నారు. బాల్య దశలోనే బిడ్డకు సరియైన ఆహారం, విద్య అభివృధి అవకాశాలు కల్పించాలన్నారు. 3 నుంచి 6 సంవత్సరాలు వయసు గల పిల్లల అందరికి మంచి పోస్టికాహారం, శారికక, మానసిక, సామజిక అభివృద్ధికి ప్రీ స్కూల్ కార్యక్రమాలు సక్రమముగా నిర్వహించాలన్నారు.

Also Read: విలీనమా.. విద్రోహమా.. విమోచనమా?

ప్రతి బిడ్డ సమగ్రముగా ఎదగాలంటే మన వంతు కృషి అవసరం అని అన్నారు. ముర్రుపాల అవశక్యత ఉపయోగాలను, బిడ్డకు అనుబంధ ఆహారం ఏ వయసులో ప్రారంభించాలని వివరించారు. పిల్లల లో పెరగుదల పర్యవేక్షణ ఎంతో ముఖ్యం అని బరువు లేని తక్కువ ఎదుగుదల గల పిల్లలు విషయములో ( SAM/ MAM) అంగన్వాడి టీచర్లు ప్రత్యేక శ్రద్ద వహించి వారి సమగ్ర పెరుగుదల కు కృషి చేయాలనీ తెలిపారు. ఈ శిక్షణ కార్య క్రమము సూపర్ వైజర్లు సిహెచ్ జ్యోతి, యాక పాషా బేగమ్, శమీం బేగం, మధురమ్మ, బ్లాక్ కో- ఆర్డినేటర్ అశం, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags

Next Story